Nayanthara: న‌య‌న‌తార మొద‌లుపెట్టిందిగా.. ఇక త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే!

ABN , Publish Date - Apr 26 , 2024 | 10:23 AM

సౌత్ ఇండియా లేడీ సూప‌ర్ స్టార్‌గా వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతున్న న‌య‌న‌తార మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. తాజాగా ఓ ఈవెంట్లో గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తూ హ‌ల్‌చ‌ల్ చేసింది.

Nayanthara: న‌య‌న‌తార మొద‌లుపెట్టిందిగా.. ఇక త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే!
nayanatara

సౌత్ ఇండియా లేడీ సూప‌ర్ స్టార్‌గా వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతున్న న‌టి న‌య‌న‌తార (Nayanthara). ఇండ‌స్ట్రీకి వ‌చ్చి దాదాపు రెండు ద‌శాబ్దాలు గ‌డిచినా కుర్ర హీరోయిన్ల‌కు సైతం లేని విధంగా భారీ అవ‌కాశాల‌తో ఔరా అనిపిస్తోంది. ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో పెళ్లి త‌ర్వాత పిల్ల‌లు వ‌చ్చాక‌ కూడా ఎక్క‌డా త‌గ్గ‌కుండా ఒక‌దాని త‌ర్వాత మ‌రోటి చిత్రాలు చేసుకుంటూ అభిమానుల‌కు వినోదాన్ని పంచుతోంది.

GMDs56mbYAAsXUk.jpeg

ఇటీవ‌లే షారుఖ్‌ఖాన్ జ‌వాన్ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసిన న‌య‌న్ (Nayanthara) జాతీయ స్థాయిలో త‌న‌ ఇమేజ్‌ను మ‌రింత‌గా రెట్టింపు చేసుకుంది.

GMDdI8iboAASgnt.jpeg

తాజాగా జీక్యూ నిర్వ‌హించిన మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ యంగ్‌ ఇండియ‌న్స్ పేరుతో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో న‌య‌న‌తార ఎంట్రీ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

GMDzSDhWYAAU1d9.jpeg

ఇది చూసిన చాలామంది నెటిజ‌న్లు మ‌నం అస‌లు చూసేది న‌య‌న‌తారనేనా మ‌రీ ఇంత‌లా చేంజ్ అయిందేంటి అంటూ మాట్లాడుకుంటున్నారు.


ఇక గురువారం జ‌రిగిన ఈ ఫొటోషూట్‌లో బాలీవుడ్ తారాలోకం అంతా పాల్గొన‌గా న‌య‌న‌తార మాత్ర‌మే స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.

GMDSSXAbYAAetHT.jpeg

త‌న‌లోని టాలెంట్‌ను బ‌య‌ట‌పెడుతూ గ్లామర్ మొత్తాన్ని ఒలకబోస్తూ ఇచ్చిన పోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చాలామంది న‌య‌న‌తార (Nayanthara) ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరూ చూసి ఆస్వాదించేసేయండి.

Updated Date - Apr 26 , 2024 | 10:23 AM