Amaran: మిల‌ట‌రీ మేజ‌ర్ రియ‌ల్ స్టోరీతో శివ‌ కార్తికేయ‌న్ సినిమా.. అదిరిపోయిన టీజ‌ర్‌

ABN , Publish Date - Feb 17 , 2024 | 07:03 PM

హీరో శివకార్తికేయన్, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న కొత్త‌ చిత్రం 'అమరన్'. భార‌త మిల‌ట‌రీ మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత‌ ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర టీజ‌ర్ శుక్ర‌వారం విడుద‌లైంది.

Amaran: మిల‌ట‌రీ మేజ‌ర్ రియ‌ల్ స్టోరీతో శివ‌ కార్తికేయ‌న్ సినిమా.. అదిరిపోయిన టీజ‌ర్‌
amaran

హీరో శివకార్తికేయన్, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న కొత్త‌ చిత్రం 'అమరన్'. అడ‌వి శేష్ 'మేజర్' లాంటి విజయవంతమైన చిత్రంతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన హాలీవుడ్ నిర్మాణ సంస్థ‌ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, కమల్ హాసన్ (Kamal Haasan)కు చెందిన‌ రాజ్‌ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వకీల్ ఖాన్ గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్ మెంట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ రోజు హీరో శివకార్తికేయన్ (Siva karthikeyan) పుట్టినరోజు సందర్భంగా శుక్ర‌వారం టైటిల్ ‘అమరన్’ టీజర్ విడుద‌ల‌ చేశారు.

siva.jpg


భార‌త మిల‌ట‌రీ మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత‌ ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో రాహుల్ సింగ్, శివ్ అరూర్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్’ పుస్త‌కం అధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ చిత్ర క‌థ‌, స్క్రీన్‌ప్లే పై చాలాకాలం క‌ష్ట‌ప‌డి రీస‌ర్చ్ చేసిన‌ రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ కంపోజర్ జివి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ 51వ ప్రొడక్షన్ గా వస్తున్న ఈ అమరన్ చిత్రం ప్రొడక్షన్ చివరి దశలో ఉండ‌గా 2024 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.

Mukund_Varadarajan.jpg

Updated Date - Feb 17 , 2024 | 07:34 PM