మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shruti Haasan: అతను ఫిట్‌ అని నాకు తెలుసు.. కానీ

ABN, Publish Date - Mar 24 , 2024 | 04:35 PM

విశ్వనాయకుడు కమల్‌హాసన్ (kamal haasan) గారాల కూతురు శ్రుతీహాసన్ (Shruti Haasan) తాజాగా 'ఇనిమేల్‌’ (Inimel)అనే ఆల్బమ్‌ చేశారు.  దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల చేశారు.

విశ్వనాయకుడు కమల్‌హాసన్ (kamal haasan) గారాల కూతురు శ్రుతీహాసన్ (Shruti Haasan) తాజాగా 'ఇనిమేల్‌’ (Inimel)అనే ఆల్బమ్‌ చేశారు.  దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల చేశారు. మార్చి 25న ఫుల్‌ ఆల్బమ్‌ విడుదల కానుంది. దీనికి కమల్‌ హాసన్‌ లిరిక్స్‌ అందించగా.. శ్రుతిహాసన్‌ కంపోజ్‌ చేశారు. ఇందులో శ్రుతీతోపాటు దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కూడా షేర్‌ చేసుకున్నారు. ఈ ఆల్బమ్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఇద్దరూ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. తొలుత ‘ఇనిమేల్‌’ ఆఫర్‌ను లోకేశ్‌ కనగరాజ్‌ తిరస్కరించారని శ్రుతీహాసన్    చెప్పారు. ‘‘లోకేశ్‌ కనగరాజ్‌ ఫేస్‌ కెమెరాకు సూట్‌ అవుతుందని చాలాకాలంగా అనుకుంటున్నా. ఈ క్రమంలోనే ‘ఇనిమేల్‌’లో రోల్‌ గురించి చెప్పా. క్షణం కూడా ఆలోచించకుండా నో చెప్పారు. చివరకు కాన్సెప్ట్‌ విని.. ఓకే అన్నారు. చాలా చక్కగా నటించారు’’ అని అన్నారు. 

దీనిపై లోకేష్‌ (lokesh kanakaraj) స్పందించారు. ‘‘నిజమే మొదట నేను ‘నో’ చెప్పా. కానీ, రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ నుంచి ఏదైనా అవకాశం వస్తే ‘నో’ చెప్పే స్థితిలో నేను లేను. పాట విన్నాను. ఒక్కసారి ప్రయత్నిద్దామనుకున్నా’’ అన్నారు.

‘ఖైదీ’ ‘విక్రమ్‌’ లాంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది ‘లియో’తో అలరించిన ఆయన ఇప్పుడు నటుడిగా అవతారమెత్తారు. తాజాగా ‘సింగపూర్‌ సెలూన్‌’లో అతిథిగా కనిపించారు. 

Updated Date - Mar 24 , 2024 | 04:42 PM