మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mohanlal 360: హిట్ పెయిర్.. 56వ సినిమా ఇది

ABN, Publish Date - Apr 20 , 2024 | 09:55 AM

మాలీవుడ్‌ వెండితెర హిట్‌ పెయిర్‌ మోహన్‌లాల్‌, శోభన జోడీ మరోసారి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. మోహన్‌లాల్‌ హీరోగా తరుణ్‌ మూర్తి దర్శకత్వంలో ఎమ్‌. రంజిత్‌ 'మోహనలాల్‌ 360’ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Mohanlal and Shobana

మాలీవుడ్‌ వెండితెర హిట్‌ పెయిర్‌ మోహన్‌లాల్‌(Mohanlal), శోభన (Shobana Chandrakumar) జోడీ మరోసారి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. మోహన్‌లాల్‌ హీరోగా తరుణ్‌ మూర్తి దర్శకత్వంలో ఎమ్‌. రంజిత్‌ 'మోహనలాల్‌ 360’(mohanlal 360)చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో శోభన కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాలో భాగమైనట్లు సోషల్‌ మీడియాలో శోభన ఓ వీడియో పంచుకున్నారు. ‘

‘మోహన్‌లాల్‌గారి 360వ సినిమాలో నేను నటించబోతున్నా. నాకు గుర్తు ఉన్నంతవరకు ఆయనతో నేను కలిసి చేయబోతున్న 56వ చిత్రం ఇది’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇక 1985లో వచ్చిన మలయాళ చిత్రం ‘అవిడతే పోలే ఇవిడెయుమ్‌’లో తొలిసారి ఈ జంట నటించారు. తదుపరి ‘మణిచిత్ర తాళు’ ‘నాడోడిక్కట్టు’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించారు. 1994లో వచ్చిన మలయాళ చిత్రం ‘తేన్మావిన్‌ కొంబాట్‌’లో మెహన్‌లాల్‌, శోభన లీడ్‌ రోల్స్‌లో నటించారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత మోహన్‌లాల్‌, శోభన కలిసి నటించనున్నారు.  2009లో వచ్చిన  ‘సాగర్‌’ ఆలియాస్‌ జాకీ రీలోడెడ్‌’లో మోహన్‌లాల్‌ హీరోగా నటించగా, శోభన గెస్ట్‌ రోల్‌ చేశారు.

Raghu Babu: నటుడు రఘుబాబుకు బెయిల్‌


Updated Date - Apr 20 , 2024 | 09:56 AM