Sai pallavi: పూజ జీవిత భాగస్వామి ఎవరో తెలుసా?

ABN , Publish Date - Jan 21 , 2024 | 06:07 PM

లేడీ పవర్‌స్టార్‌ సాయి పల్లవి ఇంట పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆమె సోదరి పూజ కన్నన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. తన ేస్నహితుడు వినీత్‌తో పూజ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు.

Sai pallavi: పూజ జీవిత భాగస్వామి ఎవరో తెలుసా?

లేడీ పవర్‌స్టార్‌ సాయి పల్లవి (Sai Pallavi) ఇంట పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆమె సోదరి పూజ కన్నన్‌ (Pooja Kannan) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. తన స్నేహితుడు  వినీత్‌తో (Vineeth) పూజ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. మరికొన్ని రోజుల్లో వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఎంగేజ్‌మెంట్‌ సెలబ్రేషన్స్‌ మొదలయ్యాయంటూ పూజ ఇన్‌స్టాలో ఫొటో షేర్‌ చేశారు. మెహందీ పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

సాయి పల్లవికి సోదరిగా పూజ దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే. కోలీవుడ్‌ చిత్రం ‘చితిరై సెవ్వానం’తో నటిగా ఎంట్రీ ఇచ్చారు. 2021లో ఈ చిత్రం విడుదలైంది. పూజ నటనతో ఆకట్టుకుంది. తాజాగా తన జీవిత భాగస్వామిని పరిచయం చేస్తూ ఇన్‌స్ట్టాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘వినీత్‌.. నా సన్‌షైన్‌. ఇప్పటివరకూ నా పార్ట్‌నర్‌ ఇన్‌ క్రైమ్‌. ఇకపై నా జీవిత భాగస్వామి’’ అని రాసుకొచ్చారు.

Updated Date - Jan 21 , 2024 | 06:07 PM