Yash: క‌న్న‌డ స్టార్ సింప్లిసిటీ.. కిరాణా షాపుకు వెళ్లి భార్య‌కు ఐస్‌క్రీం, చాక్లెట్లు కొన్న కేజీఎఫ్ హీరో

ABN , Publish Date - Feb 17 , 2024 | 05:50 PM

రాకింగ్ స్టార్ య‌శ్‌కు క‌న్న‌డ నాట ఉండే క్రేజే స‌ప‌రేటు. తాజాగా అయ‌న భార్య రాధిక కోసం ఓ కిరాణా కొట్టుకు వెళ్లి ఐస్ క్యాండీ కొనుక్కురావ‌డం నెట్టింట బాగా వైర‌ల్‌ అవుతోంది.

Yash: క‌న్న‌డ స్టార్ సింప్లిసిటీ.. కిరాణా షాపుకు వెళ్లి భార్య‌కు ఐస్‌క్రీం, చాక్లెట్లు కొన్న కేజీఎఫ్ హీరో
yash

రాకింగ్ స్టార్ య‌శ్ (Yash) కు క‌న్న‌డ నాట ఉండే క్రేజే స‌ప‌రేటు. కేజీఎఫ్ త‌ర్వాత అది మ‌రో లెవ‌ల్‌కు చేరింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా నోట‌బుల్ హీరోగా పేరు కూడా సంపాదించాడు. అభిమానులు ముద్దుగా య‌శ్‌బాస్ అని పిలుచుకునే ఆయ‌న త‌న సింపుల్ లివింగ్‌తో ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్నాడు. సినిమాల‌లోనే కాకుండా నిజ జీవితంలోనూ రియ‌ల్ హీరో అని చాలా సార్లు త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో, సేవా కార్య‌క్ర‌మాల‌తో అది నిరూపించాడు. 4 మిలియ‌న్లు పెట్టి 40 ఊర్ల‌కు పైగా ఫ్యూర్ డ్రింకింగ్ వాట‌ర్ అందించే వెసులుబాటుతో పాటు త‌న‌ య‌శోమార్గ ఫౌండేష‌న్‌తో నిత్యం ఏదో ఒక సామాజిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూనే వ‌స్తున్నాడు.

GGgylfvWsAA00-o.jpg

స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా నేనో సాధార‌ణ బ‌స్సు డ్రైవ‌ర్ కొడుకున‌నే చెప్పుకుంటాడు త‌ప్పితే ఓ స్టార్ హీరో అని ఆర్భాటాల‌కు పోడంటే అత‌ని సింప్లిసిటీ ఎంటో మ‌న‌కు ఇట్టే తెలుస్తుంది. ఇప్ప‌టికీ అత‌ని తండ్రి బ‌స్సు డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడంటే అత‌ను డౌన్ టు ఎర్త్‌గా ఉంటున్నాడో తెలుస్తుంది. సినిమాల త‌ర్వాత త‌న అమ్మా నాన్న‌, భార్య పిల్ల‌ల‌తో ఎక్కువ‌గా గ‌డిపే య‌శ్ వీలున్న‌ప్పుడ‌ల్లా త‌న భార్య పిల్ల‌లతో క‌లిసి సాధార‌ణ పౌరుల లాగానే తోటి వారితో క‌లిసిపోయి షాపింగ్ చేస్తూ అభిమానులను షాక్‌కు గురి చేస్తారు.

GGhqLrsW8AAhw9m.jpg

తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే మ‌రోటి చోటు చేసుకుంది. శుక్ర‌వారం య‌శ్ (Yash) త‌న‌ భార్య రాధిక పండిట్ (Radhika pandit) సొంత గ్రామం ఉత్త‌ర క‌ర్నాట‌క జిల్లా భత్కల్ మండ‌లం షిరాలీలోని చిత్రాపూర్ మఠానికి కుటుంబ సమేతంగా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా అరాత్రి స‌మ‌యంలో కాస్త ఖాళీ స‌మ‌యం దొర‌క‌డంతో ఫ్యామిలీని తీసుకుని ఆ మ‌ఠం ప‌రిస‌రాల్లో కాసేపు క‌లియ తిరిగారు. అదే స‌మ‌యంలో భార్యా పిల్లలు ఐస్ క్యాండీ, చిప్స్ కావాల‌ని అడ‌గ‌డంతో త‌నే స్వ‌యంగా ఓ కిరాణ కొట్టు వ‌ద్ద‌కు వెళ్లి కొనుక్కువ‌చ్చి వారికి అంద‌జేశారు.

yy.jpg


GGhPIogacAAHDDm.jpg

ఈ దృశ్యాల‌ను అక్క‌డ ఉన్న‌వారు గ‌మ‌నించి ఫొటోలు తీసి సోష‌ల్‌మీడియాలో పోస్టు చేయ‌డంతో అవి వైర‌ల్ అయి ఎక్స్‌లో దేశ‌వ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వ‌చ్చాయి. య‌శ్‌((Yash)) సింప్లిసిటీని ఆకాశానికెత్తేస్తున్నారు. ఓ భార్య‌కు ఇలాంటి భ‌ర్త ఉంటే చాలని, కోట్ల ఆస్థులు అవ‌స‌రం లేదు అడిగింది ఇచ్చే ఇలాంటి హ‌జ్బెండ్ ఉంటే చాలంటూ ఇలా ర‌క‌ర‌కాల కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరూ ఓ లుక్కేయ‌డి. ఇదిలాఉండ‌గా య‌శ్ టాక్సిక్ (Toxic The Movie) అనే పాన్‌ ఇండియా చిత్రం చేస్తుండ‌గా మ‌ళ‌యాళ క‌థానాయిక గీతూ మోహ‌న్‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది.

Updated Date - Feb 17 , 2024 | 05:50 PM