డైరెక్ట‌ర్ శంక‌ర్‌ కూతురు వివాహ వేడుక‌.. డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన బాలీవుడ్ స్టార్‌

ABN , Publish Date - Apr 17 , 2024 | 04:36 PM

డైరెక్ట‌ర్ శంక‌ర్‌ కూతురు వివాహం ఇటీవ‌ల జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.. తాజాగా చెన్నైలో రిసెప్షన్ నిర్వహించగా సినీ తారలు తమ కుటుంబ సభ్యులతో వచ్చి వేడుకల్లో భాగమయ్యారు.

డైరెక్ట‌ర్ శంక‌ర్‌ కూతురు వివాహ వేడుక‌.. డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన బాలీవుడ్ స్టార్‌
RanveerSingh

సినీ తార‌ల సంద‌డి, ఆట పాటలతో చెన్నై మురిసిపోయింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ (Shankar) కూతురు వివాహం మూడు రోజుల క్రితం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన సంగతి తెలిసిందే. త‌న ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఉన్న త‌రుణ్ కార్తికేయ‌న్ (Tarun Karthikeyan )కు త‌న పెద్ద కూతురు ఐశ్వ‌ర్య (Aishwarya Shankar)‌ల నిశ్చితార్ధం రెండు నెల‌ల క్రితం జ‌రుగ‌గా తాజాగా పెళ్లితో ఒక‌ట‌య్యారు.

RanveerSingh

అయితే.. పెళ్లి వేడుక అతికొద్ది మంది స‌మ‌క్షంలో జ‌రగగా త‌మిళ ఇండస్ట్రీకి చెందిన దిగ్గ‌జ న‌టులంతా హ‌జ‌రై వ‌ధూవ‌రుల‌ను అశీర్వదించారు. ర‌జ‌నీకాంత్ (Rajinikanth), క‌మ‌ల్‌హ‌స‌న్ (Kamal Haasan), విక్ర‌మ్ (Vikram), సూర్య (Suriya), కార్తి, న‌య‌న‌తార‌(Nayanthara), మ‌ణిర‌త్నం (Maniratnam), సుహాసిని (Suhasini), భార‌తిరాజా, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ (MK Stalin) వంటి ప్రముఖులు హ‌జ‌ర‌య్యారు. ఈ వేడుక‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

RanveerSingh


తాజాగా నిన్న చెన్నైలో రిసెప్షన్ వేడుక నిర్వహించగా యావత్ దేశం నలుమూలల నుంచి సినిమా తారలు తమ కుటుంబ సభ్యులతో వచ్చి వేడుకల్లో భాగమయ్యారు. తెలుగు నుంచి చిరంజీవి (Chiranjeevi), సురేఖ, రామ్ చరణ్ (Ram Charan ), ఉపాసపన దంపతులతో పాటు మోహన్ లాల్, జాన్వీ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, రెహామాన్, విజయ్ సేతుపతి, లోకేశ్ కనగరాజ్, అట్లీ తదితరులు హజరై వేడుకకు మరింత కల తీసుకు వచ్చారు.

RanveerSingh

ఈ వేడుకకు హజరైన బాలీవుడ్ అగ్ర నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh) శంకర్ మరో కూతురు, నటి అదితి శంకర్ (Aditi Shankar ), కుమారుడు అర్జిత్ శంకర్ (Arjith Shankar)లతో కలిసి తమిళ పాటలకు తమ శైలిలో స్టెప్పులతో అదరగొట్టారు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి.

ranveer.jpg

Updated Date - Apr 17 , 2024 | 04:47 PM