Kanguva Producer: డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కావడంతో అంత గబరా పడటం లేదు!

ABN , Publish Date - Jan 21 , 2024 | 03:22 PM

సూర్య (Suriya) కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). శివ (Shiva) దర్శకుడు. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ను సూర్య పుట్టినరోజున విడుదల చేయగా ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. ఈ సినిమాకు సంబంధించి నిర్మాత ధనుంజయన్ (Dhanunjayan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Kanguva Producer: డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కావడంతో అంత గబరా పడటం లేదు!

సూర్య (Suriya) కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). శివ (Shiva) దర్శకుడు. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ను సూర్య పుట్టినరోజున విడుదల చేయగా ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించి నిర్మాత ధనుంజయన్ (Dhanunjayan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లేటెస్ట్‌ అప్‌డేట్‌ కూడా ఇచ్చారు. ‘‘సూర్యతో ఇది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. సినిమా పూర్తి కాకముందే రిలీజ్‌ డేట్‌ ప్రకటించి ఒత్తిడికి గురి కావడం మాకు ఇష్టం లేదు. ఇది ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్‌. 3డీ, సీజీ వర్క్‌కు చాలా టైమ్‌ పడుతోంది. అందుకే మేమింకా విడుదల తేదీని నిర్ణయించలేదు. సూర్య పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. బాబీ దేవోల్‌పై కొంత చిత్రీకరణ ఉందిజ తదుపరి కాస్త ప్యాచ వర్క్‌ మిగిలి ఉంది. 10 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. ఓటీటీ వెర్షన్‌ విదేశీ భాషల్లోనూ విడుదల చేస్తాం . ప్రస్తుతం మా దృష్టి అంతా సినిమా క్వాలిటీ, నిర్మాణానంతర పనులపై ఉంది’’ అని తెలిపారు.

కంగ అనే పరాక్రముడి కథతో ‘కంగువా’ చిత్రం రూపొందుతోంది. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపిస్తారు. దిశా పఠానీ కథానాయిక నటిస్తోంది. ‘తంగలాన్‌’ చిత్రం గురించి కూడా ధనుంజయన్‌ మాట్లాడుతూ ‘‘ఇదొక యూనివర్సల్‌ స్టోరీ. ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఇది మాకొక సవాలే. ఈ చిత్రాన్ని కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలనుకుంటున్నాం. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ప్రమోషన్స్‌ చేస్తాం. ఉత్తరాదితోపాటు విదేశాల్లో ప్రచారం చేయడానికి విక్రమ్‌ సై అన్నారు. ఫిబ్రవరి నాటికి సినిమా పూర్తైతే దానికి అనుగుణంగా విడుదల చేస?్తం.’’ అని అన్నారు. విక్రమ్‌ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి పా.రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మాళవికా మోహనన్‌ కథానాయిక.

Updated Date - Jan 21 , 2024 | 03:22 PM