వామ్మో ప్రియా అట్లీ.. ఏందీ అరాచకం! హీరోయిన్లు కూడా పనికిరారు కదా

ABN , Publish Date - Mar 10 , 2024 | 08:41 PM

జ‌వాన్ సినిమాతో జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు అట్లీ. ఈ చిత్రం అసాధార‌ణ విజ‌యం సాధించ‌డంతో ఆయ‌న బాలీవుడ్‌లో ఓవ‌ర్‌నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న , ఆయ‌న భార్య ప్రియ చాలా ఈవెంట్ల‌లో స‌రికొత్త డ్రెస్సింగ్ స్టైళ్ల‌తో పాల్గొంటున్నారు.

వామ్మో ప్రియా అట్లీ.. ఏందీ అరాచకం! హీరోయిన్లు కూడా పనికిరారు కదా
priya

జ‌వాన్ (Jawan) సినిమాతో జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు అట్లీ (Atlee). ఈ చిత్రం అసాధార‌ణ విజ‌యం సాధించ‌డంతో ఆయ‌న బాలీవుడ్‌లో ఓవ‌ర్‌నైట్‌లో స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. గ‌తంలో చేసిన ‘రాజా రాణి’తో పాటు విజ‌య్‌తో చేసిన ‘అదిరింది, పొలీసోడు, బిగిల్’ వంటి సినిమాల‌తో సౌత్‌లోనూ స్టార్ డైరెక్ట‌ర్‌గా పేరు గ‌డించాడు.

priya.jpeg

ప్ర‌స్తుతం త‌ను విజ‌య్‌తో గ‌తంలో తీసిన ‘తేరి’ (పోలీసోడు) సినిమాను హిందీలో బేబీ జాన్ (Baby John) పేరుతో నిర్మిస్తున్నాడు. ఇందులో వ‌రుణ్ దావ‌ణ్‌, కీర్తి సురేశ్ జంట‌గా న‌టిస్తున్నారు.

priya 1.jpeg

అయితే ఈ సినిమా ప్రారంభోత్స‌వవ‌ నుంచి అట్లీ (Atlee) ఆయ‌న భార్య తెలుగమ్మాయి కృష్ణ ప్రియ (Priya Atlee) ఇద్ద‌రు చాలా యాక్టివ్‌గా ఉంటూ సినిమా నిర్మాణ ప‌నుల‌ను చూసుకోవ‌డ‌మే కాకుండా బాలీవుడ్‌లో త‌రుచూ జ‌రిగే ఈవెంట్స్‌, ఫంక్ష‌న్ల‌లో క‌లిసి పాల్గొంటున్నారు.

priya3.jpeg

ఈక్ర‌మంలో వారి డ్రెస్సింగ్ స్టైల్ కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. తాజాగా వీరు ఓ అవార్డ్ ఫంక్ష‌న్‌లో పాల్గొన‌గా ఈ సంద‌ర్భంగా అట్లీ (Atlee) భార్య ప్రియ (Priya Atlee) వేసుకున్న డ్రెస్ అహుతుల‌ను మెస్మ‌రైజ్ చేసింది.


హీరోయిన్ల‌ను త‌ల‌ద‌న్నేలా, గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తూ దిగిన ఆ ఫొటోలు ప్ర‌స్తుతం బ‌య‌ట‌కు రాగా సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. చాలామంది నెటిజ‌న్లు అట్లీ గారు మీ భార్య ప్రియ (Priya Atlee) హీరోయిన్‌గా ఉంది ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో సినిమా తీయ‌వ‌చ్చు క‌దా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

priya atlee.jpeg

ప్రియా అట్లీ (Priya Atlee) ముందు బాలీవుడ్ క‌థానాయుక‌లు కూడా బ‌లాదూర్ అనేలా పోస్టులు పెడుతున్నారు. మీరు కూడా ఆ ఫొటోలు చూసేయండి మ‌రి. గ‌త సంవ‌త్సరం వ‌ర‌కు ప‌ద్దతైన డ్రెస్సుల‌తో క‌నిపించిన ప్రియ.. స‌డ‌న్‌గా ఇలా గ్లామ‌ర్ లుక్‌లో క‌నిపించ‌డంతో సౌత్ అభిమానులు చాలా మంది షాక్ అయ్యారు కూడా.

Updated Date - Mar 10 , 2024 | 08:45 PM