Peter Hein: పీటర్‌ హెయిన్  మరో సాహసం!

ABN , Publish Date - Jan 06 , 2024 | 10:33 AM

ఏ సినిమా ఇండస్ట్రీలో అయిన ప్రతి ఉన్న ప్రతి ఒక్కరూ హీరోలుగా ప్రయత్నించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, డాన్స్  కొరియోగ్రాఫర్స్‌ ఇలా చాలామందే ఇలాంటి ప్రయత్నాలు చేసి హీరోలుగా మారుతున్నారు. బాహుబలి(Bahubali), ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) వంటి భారీ చిత్రాలకు యాక్షన్  కొరియోగ్రాఫర్‌గా (Action chorigrapher) పని చేసిన ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ (Peter hein) హెయిన్‌ కూడా హీరోగా ఎంట్రీకి రెడీ అయిపోయాడు.

 Peter Hein: పీటర్‌ హెయిన్  మరో సాహసం!

ఏ సినిమా ఇండస్ట్రీలో అయిన ప్రతి ఉన్న ప్రతి ఒక్కరూ హీరోలుగా ప్రయత్నించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, డాన్స్  కొరియోగ్రాఫర్స్‌ ఇలా చాలామందే ఇలాంటి ప్రయత్నాలు చేసి హీరోలుగా మారుతున్నారు. బాహుబలి(Bahubali), ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) వంటి భారీ చిత్రాలకు యాక్షన్  కొరియోగ్రాఫర్‌గా (Action chorigrapher) పని చేసిన ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ (Peter hein) హెయిన్‌ కూడా హీరోగా ఎంట్రీకి రెడీ అయిపోయాడు. ఎం.వెట్రి దర్శకత్వం వహించనున్న ఈ భారీ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాన్ని ట్రెండ్స్‌ సినిమాస్‌ అధినేత  జేఎం బషీర్‌, యంటీ సినిమాస్‌ అధినేత ఏఎం చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

గురువారం  సాయంత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం మొదలైంది. నిర్మాతల్లో ఒకరైన బషీర్‌ మాట్లాడుతూ.. ''నేను, నా మిత్రుడు చౌదరి కలిసి ఫైట్‌మాస్టర్‌ పీటర్‌ హెయిన్‌ని హీరోగా పరిచయం చేస్తూ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ తీయాలని చాలాకాలంగా అనుకుంటున్నాం. అది ఇప్పటికి కుదిరింది’’ అని అన్నారు. ఈ చిత్రం కోసం నేను ఏం చేయగలనో అది చేస్తాను. అయినా భారీ యాక్షన చిత్రం కావడంతో ప్రత్యేకంగా ట్రైనింగ్‌ తీసుకుంటున్నాను. ఇందులో అటవీ వాసీగా కనిపిస్తాను’’ అని అన్నారు.   


Updated Date - Jan 06 , 2024 | 10:35 AM