Nelson Dilipkumar: ఆ ముగ్గురిని ఒకే సినిమాలో చూపించాలి .. అదే నా కల!

ABN , Publish Date - Apr 26 , 2024 | 09:39 PM

రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా ‘జైలర్‌’ను (Jailer) తెరకెక్కించి సూపర్‌హిట్‌ చేశారు దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ (Nelson dilipkumar). తాజాగా ఓ అవార్డు వేడుకలో పాల్గొన్న ఆయన తన తదుపరి కార్యాచరణ గురించి వివరించారు.

 Nelson Dilipkumar: ఆ ముగ్గురిని ఒకే సినిమాలో చూపించాలి .. అదే నా కల!

రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా ‘జైలర్‌’ను (Jailer) తెరకెక్కించి సూపర్‌హిట్‌ చేశారు దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ (Nelson dilipkumar). తాజాగా ఓ అవార్డు వేడుకలో పాల్గొన్న ఆయన తన తదుపరి కార్యాచరణ గురించి వివరించారు. ముగ్గురు హీరోలను స్క్రీన్ పై  చూపించడం తన కల అని చెప్పారు. ‘ఒకవేళ నేను కోలీవుడ్‌ హీరో విజయ్‌ సినిమాకు దర్శకత్వం  వహిస్తే  అందులో మరికొందరు అగ్ర కథానాయకులను కూడా చూపిస్తాను. టాలీవుడ్‌ నుంచి మహేశ్‌బాబు, బాలీవుడ్‌ నుంచి షారుక్‌ ఖాన్‌, మలయాళం టాప్‌ హీరో మమ్ముట్టిలకు కీలక పాత్రలు రాస్తాను. అది నా కల. అందులో మహిళా ప్రధాన పాత్ర ఉంటే తప్పకుండా ఆ పాత్రకు నా మొదటి ఎంపిక నయనతారనే అవుతుంది’ అని చెప్పారు. ఈ కాంబినేషన్‌లో నిజంగా సినిమా వేస్త బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం నెల్సన్‌ - రజనీకాంత్‌ల కలయికలో మరో చిత్రం రానుందని టాక్‌ నడుస్తోంది. ‘జైలర్‌ 2’ ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటన వస్తుందని చెబుతున్నారు. 

Updated Date - Apr 26 , 2024 | 09:39 PM