Suriya - NBK: సింగం, సమరసింహం ఒకే స్టేజ్‌పై.. ‘ఐ లవ్ యు’
ABN , Publish Date - Nov 05 , 2024 | 12:23 PM
బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ టాక్ షో’ మూడు సీజన్లు పూర్తి చేసుకున్న నాలుగో సీజన్ నడుస్తోంది. తాజా ఎపిసోడ్‌కి తమిళ స్టార్ సూర్య అతిథిగా హాజరై సందడి చేశారు.
బాలకృష్ణ(NBK) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ టాక్ షో’ (UNstoppable) మూడు సీజన్లు పూర్తి చేసుకున్న నాలుగో సీజన్ నడుస్తోంది. తాజా ఎపిసోడ్‌కి తమిళ స్టార్ సూర్య అతిథిగా హాజరై సందడి చేశారు. తన భార్య జ్యోతిక(Jyothika) , తమ్ముడు కార్తి (Karthi) గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలకృష్ణతో సరదాగా మాట్లాడారు. కార్తి తన ఫోన్‌లో సూర్య నంబర్‌ను ఏమని సేవ్ చేసుకుంటారని అడగ్గా.. అది అవుట్ ఆఫ్ సిలబస్ అంటూ నవ్వులు పూయించారు. మొదటి క్రష్ ఎవరో చెప్పాలని కోరగా.. ‘వద్దు సర్ ఇంటికి వెళ్లాలి.. గొడవలు అవుతాయని’ సరదాగా చెప్పారు. జ్యోతిక లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేనని సూర్య ఎమోషనల్ అయ్యారు. మానవత్వం ఉన్న మనిషిగా నలుగురికి సేవ చేయడంలోనే తనకు ఆనందం ఉందన్నారు.
బాలకృష్ణ కార్తికి లైవ్‌లో ఫోన్ చేసి సూర్య గురించి అడగ్గా.. ఒక హీరోయిన్ అంటే సూర్యకు బాగా ఇష్టమని అన్నాడు. దీంతో కార్తిని ‘నువ్వు కార్తివి కాదు.. కత్తివి రా’ అని సూర్య అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కంగువా టీమ్ కూడా పాల్గొంది. బాబీదేవోల్, దర్శకుడు శివ కూడా బాలకృష్ణతో సరదాగా చిట్‌చాట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సూర్య హీరోగా శివ దర్శకత్వం వహించిన పీరియాడికల్ డ్రామా కంగువా విడుదలకు సిద్దమైంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.