మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Nayanathara: ఆన్ ఫాలో.. ఫాలో ఇష్యూకి చెక్‌ పెట్టింది!

ABN , Publish Date - Mar 03 , 2024 | 04:46 PM

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార (nayanathara) పేరు రెండ్రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ మధ్యనే  ఇన్ స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన నయనతార తన భర్త విఘ్నేశ్‌ శివన్‌ను (Vignesh Shivan) అన్‌ ఫాలో చేయడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది.

Nayanathara: ఆన్ ఫాలో.. ఫాలో ఇష్యూకి చెక్‌ పెట్టింది!


లేడీ సూపర్‌స్టార్‌ నయనతార (nayanathara) పేరు రెండ్రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ మధ్యనే  ఇన్ స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన నయనతార తన భర్త విఘ్నేశ్‌ శివన్‌ను (Vignesh Shivan) అన్‌ ఫాలో చేయడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. దీంతో రకరకాల రూమర్స్‌ మొదలయ్యాయి. తాజాగా దీనికి చెక్‌ పెట్టారు నయన్. ప్రేమికుల రోజు నయనతార తన భర్త ప్రేమను వర్ణిస్తూ విషెస్‌ చెప్పి పోస్ట్‌ పెట్టారు. కానీ, తాజాగా అతడిని అన్‌ ఫాలో చేయడంతో ఫ్యాన ఒక్కసారిగా అవాక్కయ్యారు. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందా’ అని పోస్ట్‌లు పెట్టారు. అయితే, కొన్ని మీడియా సంస్థలు వీళ్లిద్దరూ విడిపోతున్నానంటూ ప్రచారం చేశాయి. వాటికి చెక్‌ పెడుతూ నయనతార తిరిగి విఘ్నేశ్‌ను ఫాలో అవుతున్నారు.

Nayan-2.jpg

అలాగే, విఘ్నేశ్‌ ఆమె ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశారు. దీంతో రూమర్స్‌కు చెక్‌ పెట్టినట్లయింది. గత ఏడాది ‘జవాన్‌’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు నయనతార. అట్లీ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన  ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ‘టెస్ట్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్‌.మాధవన్‌, సిద్థార్థ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో కుముద అనే పాత్రలో నయన కనిపించనున్నారు. ఎస్‌. శశికాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

Updated Date - Mar 03 , 2024 | 04:46 PM