Lawrence: లారెన్స్ కి ఆ ఇద్దరు హీరోయిన్లు ! 

ABN , Publish Date - Feb 02 , 2024 | 05:34 PM

లారెన్స్‌ హీరోగా స్టూడియో గ్రీన్  సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. ‘రైడ్‌’, ‘రాక్షసుడు’ చిత్రాలతో హిట్లు కొట్టిన రమేష్‌ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. దీనికి ‘శ్రీరామరక్ష’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. కథానుగుణంగా ఈ చిత్రాంలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్‌ ఉంది.

Lawrence: లారెన్స్ కి ఆ ఇద్దరు హీరోయిన్లు ! 

లారెన్స్‌ హీరోగా స్టూడియో గ్రీన్  సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. ‘రైడ్‌’, ‘రాక్షసుడు’ చిత్రాలతో హిట్లు కొట్టిన రమేష్‌ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. దీనికి ‘శ్రీరామరక్ష’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. కథానుగుణంగా ఈ చిత్రాంలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్‌ ఉంది. ఓ కథానాయికగా నయనతార, మరో పాత్ర కోసం శ్రుతి హాసన్‌ పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయని తెలిసింది. లారెన్స్‌తో వీరిద్దరూ జోడీ కట్టడం ఇదే  మొదటిసారి.

Untitled-1.jpg

ఈ నెల 14న అధికారిక ప్రకటన రానుంది. హారర్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. లారెన్స్‌కి హారర్‌ కథలు బాగానే వర్కవుట్‌ అయ్యాయి. ‘కాంచన’ సిరీస్‌తో వసూళ్ల వర్షం కురిపించారు. ఈ జానర్‌ చిత్రాలతోనే లారెన్స్‌ మార్కెట్‌ పెరగింది అనొచ్చు. లారెన్స హిట్‌ చూసి చాలా కాలమైంది. ఈసారైనా ఈ చిత్రంతో విజయం వరిస్తుందని లారెన్స్  ఆశిస్తున్నారు. 


Updated Date - Feb 02 , 2024 | 05:34 PM