Thalaivar171: ర‌జ‌నీకాంత్‌, నాగార్జున‌, లోకేశ్‌ కనకరాజ్‌? వాట్ ఏ కాంబినేష‌న్‌

ABN , Publish Date - Apr 22 , 2024 | 09:36 AM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సెన్షెష‌న‌ల్ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో ఒక చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

Thalaivar171: ర‌జ‌నీకాంత్‌, నాగార్జున‌, లోకేశ్‌ కనకరాజ్‌? వాట్ ఏ కాంబినేష‌న్‌
171

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) సెన్షెష‌న‌ల్ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో ఒక చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. రజనీ 171 (Thalaivar 171)వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ బ్యానరుపై నిర్మాత కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేయగా, రజనీకాంత్ అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి విశేష‌ స్పందనను రాబట్టుకుంది. అయితే ఈ సినిమా టైటిల్‌ను ఈ రోజు (ఏప్రిల్ 22) సాయంత్రం విడుదల చేయ‌నున్న‌ట్లు లోకేశ్ త‌న సోష‌ల్ మీడియాలో తెల‌ప‌డంతో నెట్టింట ఇప్పుడు ఈ వార్త బాగా హ‌ల్‌చ‌ల్ అవుతోంది. #Thalaivar171TitleReveal అనే పేరిట టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది.

Rajinikanth.jpg

తాజాగా ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో రెండు రోజుల క్రితం లోకేశ్ క‌న‌గ‌రాజ్ హైద‌రాబాద్‌కు వ‌చ్చి నాగార్జున‌కు స్టోరీ చెప్ప‌డం, అది న‌చ్చి ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు సామాజిక మాధ్య‌మాల్లో న్యూస్‌ చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే ఈ వార్త‌ల‌పై అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. దీంతో మునుపెన్న‌డు చూడ‌ని మ‌ల్టీస్టార‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే రానా, ద‌ల్క‌ర్ స‌ల్మాన్ ఇందులో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తుండ‌గా ఇటీవ‌లే సీనియ‌ర్ న‌టి శోభ‌న (Shobana), శృతిహ‌స‌న్ కూడా ఈ చిత్రంలో భాగ‌మ‌వుతున‌ట్లు వార్త‌లు వినిపిస్తుండ‌డంతో ఈ సినిమాపై రోజురోజుకు అంచ‌నాలు మ‌రింత‌గా పెరుగుతున్నాయి. కాగా నాగార్జున తాజాగా ధ‌నుష్ హీరోగా రూపొందుతున్న కుబేరా సినిమాలోనూ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.


అయితే.. ఈ చిత్రం టైమ్ ట్రావెల్ క‌థ అని కొంద‌రు, లోకేశ్ సినిమాటిక్ యూనివ‌ర్స్ చిత్రాల‌లోని రోలెక్స్‌కు రిలేటెడ్‌గా ఈ సినిమా ఉండ‌బోతుంద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఈ సినిమాకు తంగ‌మ్ అనే పేరు ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలుస్తోండ‌గా జూన్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి ఈ ఏడాది చివ‌ర‌కు సినిమాను విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ఫ్టాన్ చేస్తున్నారు. అన్బరివు స్టంట్స్‌, అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. దీని త‌ర్వాత ‘ఖైదీ 2’ మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో లోకేష్ తెలిపాడు. ర‌జ‌నీకాంత్ (Rajinikanth) న‌టించిన తాజా చిత్రం వెట్ట‌యాన్ Vettaiyan (వేట‌గాడు) ఈ వేస‌విలో విడుద‌ల కానుంది.

Updated Date - Apr 22 , 2024 | 09:44 AM