Messenger: సందేశం ద్వారా ప్రాణాలు కాపాడే ‘మెసెంజర్‌’

ABN , Publish Date - Oct 31 , 2024 | 11:32 PM

పీవీకే ఫిలిమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానరుపై బి.విజయన్‌ నిర్మించిన తాజా చిత్రం ‘మెసెంజర్‌’. శ్రీరామ్‌ కార్తీక్ ప్రధాన పాత్ర పోషించగా, మనీషా జష్నానీ, ఫాతిమా నహీం, వైశాలి రవిచంద్రన్‌ హీరోయిన్‌లుగా నటించారు.

పీవీకే ఫిలిమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానరుపై బి.విజయన్‌ నిర్మించిన తాజా చిత్రం ‘మెసెంజర్‌’(Messenger). శ్రీరామ్‌ కార్తీక్ (Sriram Karthik) ప్రధాన పాత్ర పోషించగా, మనీషా జష్నానీ, ఫాతిమా నహీం, వైశాలి రవిచంద్రన్‌ హీరోయిన్‌లుగా నటించారు. లివింగ్‌స్టన్‌, ప్రియదర్శిని రాజ్‌కుమార్‌, జీవ రవి, యమున, కోదండన్‌, ఇట్స్‌ ప్రశాత్‌, కూల్‌ సురేష్‌ తదితరులు ఇతర పాత్రలను పోషించారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రమేష్‌ ఇలంగామణి.

దర్శకుడు ఈ సినిమా వివరాలను వివరిస్తూ ‘ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న హీరో ప్రేమ వైఫల్యంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడతాడు. ఆ సమయంలో ఓ మహిళ అతని ఫేస్‌బుక్‌ మెసెంజర్‌కు ఓ సందేశాన్ని పంపించి ఆ ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది.

Untitled-1.jpg

అయితే, ఆత్మహత్యకు పాల్పడబోతున్నాడే విషయం ఎలా తెలిసిందని ఆ మహిళకు హీరో మెసేజ్‌ ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. అప్పటికే చనిపోయిన ఒక వ్యక్తి తన ప్రాణాలను కాపాడినట్టుగానే నీ ప్రాణాలను కూడా కాపాడినట్టు చెబుతుంది. ఇంతకీ ఆ మహిళ ఎవరో కనుగొనేందుకు హీరో చేసే ప్రయత్నమే ఈ కథ. ఇది ఒక ఫాంటసీ లవ్‌ స్టోరీ.

చెన్నై, విల్లుపురం జిల్లా విక్రవాండి పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. త్వరలోనే టీజర్‌, ట్రైలర్‌ రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 11:32 PM