మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Celebrity Marriage: 'ఆదికేశవ' వైష్ణవ్ తేజ్ సిస్టర్ పెళ్లి, వరుడెవరంటే...

ABN, Publish Date - Apr 04 , 2024 | 11:29 AM

ఈమధ్య చాలామంది నటీమణులు వివాహం చేసుకుంటున్నారు. లావణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి పన్ను, కృతి ఖర్బందా, అక్ష ఇలా చాలామంది తాము ప్రేమించిన అబ్బాయిలని పెళ్లి చేసుకున్నారు. ఇప్పడు ఈ వరసలో ఇంకో నటి కూడా వివాహం బంధంలోకి అడుగు పెట్టబోతోంది, ఆమె ఎవరంటే..

Aparna Das

గత సంవత్సరం వైష్ణవ్ తేజ్ నటించిన 'ఆదికేశవ' సినిమా విడుదలైన సంగతి అందరికీ గుర్తుంది కదా. అందులో శ్రీలీల కథానాయకురాలిగా చేసింది, శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం చేసాడు. ఈ సినిమా వైష్ణవ్ తేజ్ కి మంచి బ్రేక్ ఇస్తుందని అనుకున్నారు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గరా ఈ సినిమా ప్రభావం అంతగా చూపించలేదు. అయితే ఇదే సినిమాలో ఒక మలయాళం అమ్మాయి తెలుగులో ఆరంగేట్రం చేసింది.

ఆమె ఎవరో కాదు అపర్ణ దాస్. ఆమె మలయాళంలో, తమిళంలో సినిమాలు చేసి తెలుగులో ఈ 'ఆదికేశవ' తో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె వైష్ణవ్ తేజ్ సిస్టర్ గా ఒక కీలకపాత్రలో నటించింది. అయితే ఇప్పుడు ఈ అపర్ణ దాస్ వార్తల్లో వుంది. ఆమె వివాహ పత్రిక సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉండటమే. ఆమె, నటుడు దీపక్ పరంబోల్ (Deepak Parambol) ని వివాహం చేసుకోబోతోంది అని ఈ వివాహ పత్రిక ద్వారా అందరికీ తెలిసింది. దీపక్ చాలా మలయాళం సినిమాల్లో నటించాడు, అలాగే వెబ్ సిరీస్ కూడా చేసాడు, కానీ ఈమధ్యనే మలయాళంలో విడుదలై సంచనలం సృష్టించిన 'మంజిమల్ బాయ్స్' అనే సినిమాలో కూడా నటించాడు.

ఈమధ్య చాలామంది నటీమణులు చాలాకాలం నుండి తాము ప్రేమిస్తున్న అబ్బాయిలను వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి పన్ను, కృతి ఖర్బందా, అక్ష వీళ్ళందరూ తెలుగు సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకొని తమ బాయ్ ఫ్రెండ్స్ ని వివాహం చేసుకున్నారు.

మలయాళం నటి అపర్ణ దాస్ కూడా ఇప్పుడు అదే బాటలో తన బాయ్ ఫ్రెండ్, నటుడు దీపక్ కి ఏప్రిల్ 24న వివాహం చేసుకోబోతున్నట్టుగా ఈ వివాహ పత్రిక ద్వారా తెలుస్తోంది. ఈ వివాహం కేరళలోని వడకంచేరీ అనే నగరంలో చేస్తున్నట్టుగా అర్థం అవుతోంది. వీరిద్దరూ కలిపి కూడా కొన్ని మలయాళం సినిమాలలో నటించారని తెలుస్తోంది.

Updated Date - Apr 04 , 2024 | 11:30 AM