Mohanlal: ఓటీటీలోకి.. అదిరిపోయే కోర్టు డ్రామా చిత్రం! ఎప్ప‌టి నుంచంటే

ABN , Publish Date - Jan 19 , 2024 | 04:58 PM

ఓటీటీ ప్రేక్ష‌కులను అల‌రించ‌డానికి మ‌రో డ‌బ్బింగ్ చిత్రం సిద్ధ‌మ‌వుతున్న‌ది. మ‌ల‌యాళ ఆగ్ర న‌టుడు మోహ‌న్ లాల్, ప్రియ‌మ‌ణి , అనశ్వర రాజన్ ,సిద్ధిక్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఆ చిత్రం నేరు. దృశ్యం 1,2 వంటి సినిమాలను రూపొందించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హించారు.

Mohanlal: ఓటీటీలోకి.. అదిరిపోయే కోర్టు డ్రామా చిత్రం! ఎప్ప‌టి నుంచంటే
mohan lal,neru

ఓటీటీ ప్రేక్ష‌కులను అల‌రించ‌డానికి మ‌రో డ‌బ్బింగ్ చిత్రం సిద్ధ‌మ‌వుతున్న‌ది. మ‌ల‌యాళ ఆగ్ర న‌టుడు మోహ‌న్ లాల్ (Mohanlal), ప్రియ‌మ‌ణి (Priyamani), అనశ్వర రాజన్ (Anaswara Rajan ),సిద్ధిక్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఆ చిత్రం నేరు (Neru). దృశ్యం 1,2 వంటి సినిమాలను రూపొందించిన జీతూ జోసెఫ్ (Jeethu Joseph) ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హించారు. మ‌ల‌యాళం నుంచి త‌రుచూ, అధికంగా వ‌చ్చే క్రైమ్ థ్రిల్ల‌ర్ కాకుండా కోర్టు డ్రామా జాన‌ర్‌లో రూపొందిన ఈ చిత్రం గ‌త డిసెంబ‌ర్ 21న విడుద‌లై ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లతో భారీ విజ‌యం సాధించి 2023 సంవ‌త్స‌రానికి గ్రాండ్‌గా ముగింపు ప‌లికింది.

ఇక క‌థ విష‌యానికి వ‌స్తే.. సారా అహ్మ‌ద్ అనే అంధురాలిని ఓ అగంత‌కుడు అత్యాచారం చేసి పారి పోతాడు. పొలీసులు అత‌న్ని క‌నిపెట్ట‌లేక‌ పోవడంతో స్వతహాగా శిల్పి అయిన బాధితురాలే అత్యాచారం చేసిన వ్య‌క్తి రూపాన్ని త‌యారు చేస్తుంది. దాని ఆధారంగా పొలీసులు ముంబాయ్‌లో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త కొడుకు మైఖేల్ జోసెప్‌ను అరెస్ట్ చేస్తారు. ఈ క్రమంలో కేసును వాధించ‌డానికి అప‌జ‌య‌మే లేని రాజ‌శేఖ‌ర్ అనే లాయ‌ర్‌ను వ్యాపార‌వేత్త నియ‌మించుకుని బెయిల్‌పై నిందితుడిని బ‌య‌ట‌కు తీసుకువ‌స్తారు.


ఇదిలాఉండ‌గా త‌న‌పై ఎంత ఒత్తిడి వ‌స్తున్నా,ఓవ‌రెన్ని బెదిరింపులు చేస్తున్నా స‌ద‌రు భాదితురాలు ఈ కేసు పైనే పోరాటం చేయాల‌ని అనుకుంటుంది. ఓ పొలీస్ ఆఫీస‌ర్ సూచ‌న‌తో విజ‌య్ మోహ‌న్ అనే లాయ‌ర్ ద‌గ్గ‌రికి ఈ కేసు వెళ్లడంతో ఆయ‌న కుదరదు అంటూనే అ అమ్మాయి త‌రుపున కేసు వాదించ‌డం మొద‌లు పెడ‌తాడు.

ఈక్ర‌మంలో అత్యాచారం చేసిన నిందితుడిని ప‌ట్టుకున్నారా, మ‌ధ్య‌లో ప్రియ‌మ‌ణి ఎంట్రీ త‌దిత‌ర ఇంట్రెస్టింగ్ డ్రామాతో సినిమా ఆక‌ట్టుకుంటుంది. చివ‌ర‌కు నిందితుడిని ఎలా ప‌ట్టుకున్నార‌నే క‌థ‌తో సినిమా రూపొందింది. ఇప్పుడు ఈ సినిమా జన‌వ‌రి 23 (సోమ‌వారం) నుంచి డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) లో మ‌ల‌యాళంతో పాటు, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హాందీ భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.

Updated Date - Jan 19 , 2024 | 05:07 PM