మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lokesh Kanagaraj: అబ్బో.. లోకేశ్ ఇర‌గొట్టాడుగా! శృతిహ‌స‌న్‌తో ఓ రేంజ్‌లో రొమాన్స్‌

ABN, Publish Date - Mar 21 , 2024 | 08:07 PM

సౌత్ ఇండియా టాప్ డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ న‌టుడుగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. లోకేశ్ హీరోగా శృతిహ‌స‌న్ క‌థానాయిక‌గా రెండు రోజుల క్రితం ఓ చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు

sruthi hasan, lokesh

సౌత్ ఇండియా టాప్ డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ న‌టుడుగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. లోకేశ్ (Lokesh Kanagaraj) హీరోగా శృతిహ‌స‌న్ (Shruti Haasan) క‌థానాయిక‌గా రెండు రోజుల క్రితం ప్ర‌ఖ్యాత రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ (Raajkamal films International) ఓ చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే స‌డ‌న్ గా ఈ చిత్ర ప్ర‌క‌ట‌న‌తో త‌మిళ ఇండ‌స్ట్రీతో పాటు సౌత్ ఇండ‌స్ట్రీలన్నీ షాక్ అవ‌డ‌మేకాక‌ అటెన్ష‌న్ అంతా ఇప్పుడు ఈ చిత్రం పై ప‌డింది. ఈ సినిమాకు ఇనిమెల్ (Inimel) అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌గా సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. ఈ గ్లిమ్స్ చాలా రొమాంటిక్‌గా ఉండ‌డం, లోకేశ్‌, శృతి హ‌స‌న్ చాలా ఈజ్‌తో న‌టించడం క‌నిపించింది.

దీంతో దీన్ని చూసిన వారంతా లోకేశ్ క‌న‌గ‌రాజ్ న‌క్క తోక తొక్కాడు.. మొద‌టి సినిమానే హీరోగా శృతిహ‌స‌న్‌తో క‌లిసి న‌టించే ఛాన్స్ కొట్టేశాడంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా ద‌ర్శ‌కుడిగా సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు.. న‌టుడిగా కూడా విజ‌యం సాధించాల‌ని కోరుతున్నారు.


రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్‌ (Raajkamal films International) ప‌తాకంపై క‌మ‌ల్‌హాస‌న్ (Kamal Haasan ), మ‌హేంద్ర‌న్ (Mahendran) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా ద్వార‌కేశ్ ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మార్చి 25న ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌టట్లు ప్ర‌క‌టించారు. ఇంకా ఆల‌స్య‌మెందుకు మీరు ఆ గ్లిమ్స్ చూసేయండి.

Updated Date - Mar 21 , 2024 | 08:10 PM