UI The Movie: UI మూవీ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో చెప్పేసిన ఉపేంద్ర..
ABN , Publish Date - Dec 19 , 2024 | 01:20 PM
ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఉపేంద్ర 'UI' ఫీవర్ షురూ అయ్యింది. దీంతో ఇంటర్నెట్‌లో అనేక వార్తలు ప్రచారమవుతున్నాయి. వీటిపై అడ్వాన్స్‌డ్ రూత్‌లెస్ డిక్టేటర్ 'ఉపేంద్ర' తన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు.
ప్రస్తుతం సినీ అభిమానులందరు ఎంతో వెయిట్ చేస్తున్న సినిమా 'యూఐ'. సెన్సేషనల్ డైరెక్టర్, యాక్టర్ ఉపేంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళ భాషలతో పాటు హిందీలోను గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా క్లైమాక్స్‌పై అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో హీరో, డైరెక్టర్ ఉపేంద్ర అసలు క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో చెప్పేశారు.
ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'యూఐ' సినిమాకు ఒక్కో థియేటర్లో, ఒక్కో క్లైమాక్స్ ఉంటుందని ప్రచారం సాగుతుంది. ఈ సినిమా కోసం రెండు క్లైమాక్స్ సీన్స్ రాసుకొని, షూట్ చేశారని జోరుగా వార్తలు చక్కర్లు కొట్టేస్తున్నాయి. తాజాగా ఉపేంద్ర దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. ఒక్కో థియేటర్లో, ఒక్కో క్లైమాక్స్ అనే వార్త అసత్యమని చెప్పుకొచ్చారు. అయితే కంటెంట్ బాగుంటుంది కాబట్టి సినిమాను ఒకటికి రెండు సార్లు చూడాలి అనిపిస్తుందని తన స్టైల్ లో చమత్కరించారు.
ఇక ఈ మూవీ విషయానికొస్తే.. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, వీడియోస్‌తో సినీ వర్గాల్లో విపరీతమైన బజ్ పెరిగిపోయింది. భాషతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ 'కల్కి' సినిమాలోలాగ ఇందులోనూ సెపరేట్ వరల్డ్ బిల్డ్ చేయడం విశేషం. 'కల్కి' మైథలాజికల్ వరల్డ్ అయితే 'UI' సైకాలాజికల్ వరల్డ్.
సినిమా కథ విషయానికొస్తే.. 2040 సంవత్సరంలో గ్లోబల్ వార్మింగ్, COVID-19, ద్రవ్యోల్బణం, ఏఐ, నిరుద్యోగం, యుద్ధం యొక్క నిరంతర ముప్పు అస్తవ్యస్తమైన, బాధాకరమైన సమాజానికి దారి తీస్తాయి. వినాశకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, సామాజిక విభజనలు పాతుకుపోయాయి. కులం,మతం, సంఘర్షణ, విభజన మూలాలుగా వ్యక్తుల జీవితాల మారుస్తాయి. ఈ డిస్టోపియన్ వరల్డ్‌లో ఉపేంద్ర నియంతగా కనిపించనున్నారు. మార్పు కోసం, న్యాయం కోసం, మంచి భవిష్యత్తు కోసం కష్టజీవుల నిరసనలకు దిగుతారు. అప్పుడు పవర్ ఫుల్‌గా ఎంట్రీ ఇచ్చే ఉపేంద్ర రూత్‌లెస్‌గా కనిపిస్తారు. ఈ మూవీలో రీష్మా నానయ్య, మురళీ శర్మ, సన్నీలియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీ కృష్ణ, ఇంద్రజిత్ లంకేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.