సహనటికి లైంగిక వేధింపులు.. నటుడు అరెస్ట్
ABN , Publish Date - Dec 29 , 2024 | 08:18 AM
సహ నటిని లైంగిక వేధింపులకు గురి చేయడం, మాట వినకుంటే చంపేస్తానని బెదిరించాడనే ఆరోపణలపై బెంగళూరులోని రాజేశ్వరీ పేట పోలీసులు టీవీ నటుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
కన్నడ టీవీ నాటికల్లో నటించే ప్రముఖ నటుడు చరిత్ బాలప్ప శుక్రవారం అరెస్ట్ అయ్యాడు. సహ నటిని లైంగిక వేధింపులకు గురి చేయడం, మాట వినకుంటే చంపేస్తానని బెదిరించాడనే ఆరోపణలపై బెంగళూరులోని రాజేశ్వరీ పేట పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కన్నడలో ముద్దు లక్ష్మి అనే నాటికతో పేరొందిన చరిత్.. పలు తెలుగు నాటికల్లోనూ నటించాడు. కన్నడ, తెలుగు నాటికల్లో నటించే ఓ నటి(29) బాలప్ప తనని వేధిస్తున్నాడంటూ డిసెంబరు 13న పోలీసులను ఆశ్రయించింది.
Also Read-Game Changer: ‘గేమ్ చేంజర్’ యూనిట్‌కు రామ్ చరణ్ ఫ్యాన్ వార్నింగ్
చరిత్ ప్రేమ పేరుతో తనకు దగ్గరై బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. కాగా, చరిత్‌కు ఇది వరకే వివాహమవ్వగా న్యాయస్థానం ద్వారా భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. భరణం కోసం నోటీసులు పంపిన మాజీ భార్యను చరిత్ బెదిరించడంతో జూన్‌లో ఆయనపై ఓ కేసు నమోదైంది. ఇప్పుడాయనపై ఇలా మరో కేసు కూడా నమోదవడంతో.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆయనని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
ఈ మధ్య కాలంలో ఇటువంటి కేసులు బాగా పెరుగుతున్నాయి. కాస్త పేరు రాగానే, నటులంతా ఇటువంటి కేసుల్లో ఇరుక్కుంటున్న విషయం తెలిసిందే. తెలుగులోనూ ఈ మధ్య ఇలాంటి కేసుల్లో పలువురు నటులు అరెస్ట్ అయ్యారు. అందులో ‘పుష్ప’లో కేశవ పాత్ర చేసిన జగదీష్, నటుడు శ్రీతేజ్ వంటి వారిపై ఇటీవల ఏ విధంగా వార్తలు వినిపించాయో తెలిసిందే. వీరే కాదు, ఇంకా పలువురి పేర్లు ఇలాంటి కేసుల్లో వినిపించాయి.