Star actor arrested: మర్డర్ కేసులో కన్నడ స్టార్ నటుడు దర్శన్ అరెస్టు

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:40 AM

కన్నడ స్టార్ నటుడు దర్శన్ ని ఈరోజు ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. పెళ్ళైనా కూడా పవిత్ర గౌడ అనే నటితో సన్నిహితంగా ఉంటూ వివాదంలో వున్న దర్శన్, ఇప్పుడు ఈ హత్య కేసులో అరెస్టవటంతో కర్ణాటక రాష్ట్రంలో సంచలనంగా మారింది

Star actor arrested: మర్డర్ కేసులో కన్నడ స్టార్ నటుడు దర్శన్ అరెస్టు
Kannada actor Darshan

కన్నడ స్టార్ నటుడు దర్శన్ ని ఈరోజు ఉదయం ఒక హత్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు. మైసూరు ఫార్మ్ హౌస్ లో నటుడు దర్శన్ ఉండగా అతన్ని అరెస్టు చేసినట్టుగా సమాచారం. గత సంవత్సరం డిసెంబర్లో దర్శన్ నటించిన 'కాటేరా' అనే సినిమా విడుదలయింది, ఇది అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. దర్శన్ కి పెళ్ళైనా కూడా పవిత్ర గౌడ అనే నటితో చాలా సన్నిహితంగా ఉంటున్నాడు అని వార్తలు ఎన్నో వచ్చాయి. (Kannada star actor Darshan was arrested by Karnataka police in a muder case)

darshanpavitragowda.jpg

ఇంతకీ దర్శన్ ని ఎందుకు అరెస్టు చేశారంటే రేణుక స్వామి హత్య విషయంలో దర్శన్ పాత్ర వున్నట్టుగా పోలీసుల అనుమానం. నటి పవిత్ర గౌడకి ఈ రేణుక స్వామి అనే వ్యక్తి అభ్యంతకర మెసేజ్ లు పంపుతూ ఉండటం లాంటివి చేస్తూ ఉండేవాడని, అదీ కాకుండా పవిత్రను కొంచెం భయపెట్టడం లాంటిది చేసేవాడని, పవిత్ర ఈ విషయం దర్శన్ కు చెప్పడంతో దర్శన్ రేణుక స్వామిని హత్య చేయించినట్లు గా వార్తలు వస్తున్నాయి. (Darshan has taken into custody by police at his farm house in Mysore)

darshanpavitragowdapic.jpg

రేణుక స్వామి శరీరం మైసూరు ప్రాంతంలో దొరికినప్పుడు ముందుగా అది ఆత్మహత్య అనుకున్నారు, కానీ కొంచెం లోతుగా పరిశోధనలు చేసిన తరువాత, అది హత్య అని తేలింది. దీనికి సంబంధించి పోలీసులు సుమారు పదిమందిని అరెస్టు చేసి విచారణ చెయ్యగా, అందరూ దర్శన్ వైపే వేలెత్తి చూపినట్టుగా తెలిసింది. దర్శన్ ఈ హత్యకి పురమాయించాడని, అందుకే చెయ్యాల్సి వచ్చిందని అరెస్టయిన వారు చెప్పినట్టుగా తెలిసింది. దర్శన్ అరెస్టుపై అతని కుటుంబ సభ్యులు ఇంకా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు.

Updated Date - Jun 11 , 2024 | 11:40 AM