Yuva Rajkumar: డైవ‌ర్స్ బాట‌లో మ‌రో స్టార్ హీరో.. ఒక‌రిపై ఒక‌రు ‘అక్ర‌మ’ ఆరోప‌ణ‌లు

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:55 PM

సౌత్ సినీ ఇండ‌స్ట్రీని డైవ‌ర్స్ అనే ప‌దం విడిచిపెట్ట‌డం లేదు. తాజాగా ఈ కోవ‌లోకి క‌న్న‌డ యువ న‌టుడు క‌న్న‌డ రాష్ట్ర‌ ర‌త్న రాజ్‌కుమార్ మ‌నువ‌డు యువ రాజ్ కుమార్ వ‌చ్చి చేరాడు.

Yuva Rajkumar: డైవ‌ర్స్ బాట‌లో మ‌రో స్టార్ హీరో.. ఒక‌రిపై ఒక‌రు ‘అక్ర‌మ’ ఆరోప‌ణ‌లు
yuva rajkumar

సౌత్ సినీ ఇండ‌స్ట్రీని డైవ‌ర్స్ అనే ప‌దం విడిచిపెట్ట‌డం లేదు. నిన్న‌టివ‌ర‌కు త‌మిళ నాట ధ‌నుష్‌, జీవీ ప్ర‌కాశ్ కుమార్ ఇలా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు విడాకుల బాట ప‌ట్టి అంత‌టా ట్రెండింగ్‌లో నిలిచిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. తాజాగా ఈ కోవ‌లోకి క‌న్న‌డ యువ న‌టుడు క‌న్న‌డ రాష్ట్ర‌ ర‌త్న రాజ్‌కుమార్ మ‌నువ‌డు యువ రాజ్ కుమార్ (Yuva Rajkumar) వ‌చ్చి చేరారు.

Yuva-Rajkumar

రాజ్ కుమార్ రెండో కుమారుడు రాఘ‌వేంద్ర రాజ్ కుమార్ (Raghavendra Rajkumar) వార‌సుడిగా ఇటీవ‌లే యువ అనే కన్న‌డ చిత్రంతో సినిమా అరంగేట్రం చేసిన యువ రాజ్‌కుమార్ తాజాగా త‌న భార్య శ్రీదేవి (Sridevi Byrappa)తో విడాకుల కొరుతూ ఎన్నో నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య‌ ఫ్యామిలీ కోర్టును అశ్ర‌యించాడు.

Yuva-Rajkumar

విష‌యానిక వ‌స్తే.. ఇటీవ‌లే యువ అనే సినిమాతో హీరోగా క‌న్న‌డ సినీ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి విజ‌యం సాధించాడు యువ రాజ్‌కుమార్ (Yuva Rajkumar). బాల న‌టుడిగా ఒక‌టి రెండు సినిమాల్లో న‌టించిన ఆయ‌న నాలుగేండ్ల క్రితం ఇంట్లో వారు నిరాక‌రించినా త‌న బాబాయ్ దివంగ‌త పునీత్ రాజ్ కుమార్ స‌పోర్టుతో మైసూరుకు చెందిన‌ శ్రీదేవి భైర‌ప్ప‌ను యువ రాజ్‌కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నాడు.

Yuva-Rajkumar

అనంత‌రం శ్రీదేవి (Sridevi Byrappa) డాక్ట‌ర్ రాజ్‌కుమార్ పేరిట ఫ్యామిలీ నిర్వ‌హిస్తున్న సివిల్ స‌ర్వీసెస్ వ్య‌వ‌హ‌రాల‌ను చూసుకున్న‌ది. ప్ర‌స్తుతం ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికాలో ఉంటోంది.


ఈ క్ర‌మంలోనే యువ రాజ్‌కుమార్ (Yuva Rajkumar) త‌న భార్య బాగా వేదిస్తోందని ఆమె నుంచి విడాకుల ఇప్పించాల‌ని కోరుతూ జూన్ 6 న ఫ్యామిలీ కోర్టులో ఫిటిష‌న్ వేశాడు. దీతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చి బాగా వైర‌ల్ అయింది. ఈ విష‌యం తెలుసుకున్న శ్రీదేవి (Sridevi Byrappa) ఘాటుగానే స్పందించింది. ఇదిలాఉండగా వీరిద్ద‌రి మ‌ధ్య ఆరేడు నెల‌ల కింద‌టే మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

Yuva-Rajkumar

రీసెంట్‌గా యువ రాజ్ కుమార్ (Yuva Rajkumar) త‌రుపు న్యాయ‌వాదులు విలేఖ‌రులు స‌మావేశం ఏర్పాటు చేసి ఆస‌క్తిక‌ర అంశాల‌ను తెలిపారు. శ్రీదేవి (Sridevi Byrappa) త‌న భ‌ర్త ఇంటి పేరును దుర్వినియోగం చేస్తున్న‌దని, అల్రెడీ పెళ్లైన‌ మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తోంద‌ని అన్నారు. ఆపై త‌న సంబంధాన్ని దాచేందుకు యువకు ఓ న‌టితో ఎఫైర్ ఉందంటూ ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని అన్నారు. యువ‌కు లైంగిక లోపం ఉందంటూ మా నోటీసుల‌కు స‌మాధాన‌మిచ్చిందని ఆ స‌మ‌స్య ఉంటే న‌టితో ఎఫైర్ ఎలా పెట్టుకుంటాడంటూ క్వ‌శ్చ‌న్ చేశారు.

Yuva-Rajkumar

దీనికి శ్రీదేవి భైర‌ప్ప (Sridevi Byrappa) స్పందిస్తూ.. న్యాయం ఎప్ప‌టికైనా విజ‌యం సాధిస్తుందంటూ త‌న పోస్టులో త‌న అభిప్రాయాన్ని రాసుకొచ్చింది. గ‌త కొంత‌కాలం నుంచి నేను తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నాన‌ని, కుటుంబ గౌర‌వం కోసం ఇన్నాళ్లుగా మౌనంగా ఉంటున్నాన‌ని, ఇప్ప‌టికీ నేను అలాగే ఉన్నాని పేర్కొంది. ఓ మ‌హిళ‌పై ఇంత నీచంగా ఆరోప‌ణ‌లు చేయ‌డం సంస్కారం కాద‌ని అన్నారు. యువ రాజ్‌కుమార్ (Yuva Rajkumar)కు ఓ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఓ క‌న్న‌డ‌ స్టార్ న‌టితో ఎపైర్ ఉన్న‌ద‌నేది వాస్త‌వ‌మ‌ని, అది ఇప్పుడు కాక‌పోయినా త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని అన్నారు.

Updated Date - Jun 11 , 2024 | 01:21 PM