హీరోయిన్‌తో ఎఫైర్‌.. ఆ హీరో ఇంట ర‌చ్చ ర‌చ్చ‌

ABN , Publish Date - Jan 26 , 2024 | 06:46 PM

రాబ‌ర్ట్ అనే డ‌బ్బింగ్ సినిమా ద్వారా తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన హీరో ద‌ర్శ‌న్. అభిమానుల‌తో డీ బాస్ గా పిల‌వ‌బ‌డుతూ క‌న్న‌డ‌నాట‌ ఆగ్ర న‌టుల్లో ఒక‌డిగా వెలుగొందుతున్నాడు. ఆయితే ఈ న‌టుడు తాజాగా ఓ తీవ్ర వివాదంలో చిక్కుకోగా సోష‌ల్ మీడియాలో, క‌న్న‌డ నాట ఆ వార్త‌లు పెద్ద దుమార‌మే లేపుతున్నాయి.

హీరోయిన్‌తో ఎఫైర్‌.. ఆ హీరో ఇంట ర‌చ్చ ర‌చ్చ‌
darshan

రాబ‌ర్ట్ అనే డ‌బ్బింగ్ సినిమా ద్వారా తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన హీరో ద‌ర్శ‌న్ (Darshan Thoogudeepa). అభిమానుల‌తో డీ బాస్ (D Boss) గా పిల‌వ‌బ‌డుతూ క‌న్న‌డ‌నాట‌ ఆగ్ర న‌టుల్లో ఒక‌డిగా వెలుగొందుతున్నాడు. ఇటీవ‌లే ఆయ‌న హీరోగా న‌టించిన‌ కాటారా అనే సినిమా విడుద‌లై రూ.200 కోట్లకు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి క‌ర్ణాట‌క‌లో స‌రికొత్త రికార్డులు తిర‌గ రాయ‌డంతో ఆయ‌న ఈ మ‌ధ్య బాగా వార్త‌ల్లో నిలిచాడు. ఆయితే ఈ న‌టుడు తాజాగా ఓ తీవ్ర వివాదంలో చిక్కుకోగా సోష‌ల్ మీడియాలో, క‌న్న‌డ నాట ఆ వార్త‌లు పెద్ద దుమార‌మే లేపుతున్నాయి. హీరోయిన్ ప‌విత్ర గౌడ‌(Pavithra Gowda)తో ద‌ర్శ‌న్‌కు ఆఫైర్ ఉందంటూ గ‌త కొంత‌కాలంగా అక్క‌డ మీడియాలోనూ వార్త‌లు బాగా వ‌స్తున్నాయి.

తాజాగా ఈ విష‌యంలోనే ద‌ర్శ‌న్ ఇంట్లో గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని, అంతేగాక ద‌ర్శ‌న్ భార్య విజ‌య‌ల‌క్ష్మి (Vijaylakshmi) న‌టి ప‌విత్ర గౌడ‌(Pavithra Gowda)తో గొడ‌వ ప‌డిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు కూడా వైర‌ల్ అయ్యాయి. ఇది నిజం అన్న‌ట్లుగా ఈ మ‌ధ్య ప‌విత్ర సోష‌ల్‌ మీడియాలో పెట్టిన పోస్టు ఆ వార్త‌ల‌కు బ‌లం చేకూర్చగా , ద‌ర్శ‌న్ ఇంట్లో గొడ‌వ‌లు జ‌ర‌గ‌డానికి కార‌ణం అయింది. ద‌ర్శ‌న్‌తో క‌లిసి ప‌విత్ర దిగిన‌ ఫోటోల‌న‌న్నింటిని ఓ వీడియో రూపంలోకి మార్చి మా ఇద్ద‌రి మ‌ధ్య బంధానికి ప‌దేళ్లు పూర్త‌య్యాయ‌ని, ఈ లైఫ్ ఎంతో హ్యాఫీగా ఉందంటూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. అంతే ఆ వీడియో బాగా వైర‌ల్ అయి క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో ర‌చ్చ లేపుతోంది.


ఆ వీడియోను చూసిన ద‌ర్శ‌న్ కుటుంబ స‌భ్యులు ఒక్క‌సారిగా షాక్‌కు గురై ప‌విత్ర (Pavithra Gowda)పై ఓ స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈక్ర‌మంలోనే ద‌ర్శ‌న్ భార్య విజ‌య‌ల‌క్ష్మి (Vijaylakshmi) న‌టి ప‌విత్రకు ఫొన్ చేసి తిట్ట‌డ‌మే కాక‌, భ‌విష్య‌త్తులో ద‌ర్శ‌న్‌తో క‌నిపించొద్ద‌ని, అవ‌స‌ర‌మైతే కోర్టుకు వెళ్లి చ‌ర్య‌లు తీసుకుంటానని గ‌ట్టిగానే హెచ్చ‌రించిన‌ట్లు నెట్టింట వార్త‌లు బాగా ప్ర‌చారం అవుతున్నాయి. ముఖ్యంగా క‌న్న‌డ మీడియాల్లో ఈ వార్తే ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. చూడాలి ఈ వివాదం ఎక్క‌డి వ‌ర‌కు వెళ్తుందో, ఎక్క‌డ‌ ముగుస్తుందో.

Updated Date - Jan 26 , 2024 | 06:52 PM