Kanguva: దీపావళికి సిద్ధమేనా?

ABN , Publish Date - May 21 , 2024 | 10:15 AM

మాస్‌ కమర్షియల్‌ చిత్రాలతోపాటు భిన్నమైన పాత్రలను ఎంచుకుంటారు తమిళ హీరో సూర్య (Suriya). అలాంటి ప్రయత్నాలో ప్రస్తుతం ఆయన చేస్తున్న 'కంగువా’ (Kanguva)కూడా ఉంది. మరికొద్ది రోజుల్లో థియేటర్లలో తన పరాక్రమం చూపించడానికి సిద్థమవుతున్నారు సూర్య.

Kanguva: దీపావళికి సిద్ధమేనా?


మాస్‌ కమర్షియల్‌ చిత్రాలతోపాటు భిన్నమైన పాత్రలను ఎంచుకుంటారు తమిళ హీరో సూర్య (Suriya). అలాంటి ప్రయత్నాలో ప్రస్తుతం ఆయన చేస్తున్న 'కంగువా’ (Kanguva)కూడా ఉంది. మరికొద్ది రోజుల్లో థియేటర్లలో తన పరాక్రమం చూపించడానికి సిద్థమవుతున్నారు సూర్య. శివ (Shiva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ కథానాయిక. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులో సూర్య-బాబీ దేవోల్‌ (Bobbydeol)మధ్య వచ్చే క్లైమాక్స్‌ సన్నివేశాలను దాదాపు 10వేల మందితో తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఆ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్‌ మీడియా చెబుతోంది. అయితే త్వరలో ఈ వివరాల్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నారు. కంగ అనే ఓ పరాక్రముడి కథతో పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Updated Date - May 21 , 2024 | 10:15 AM