Kamal haasan: హెచ్.వినోద్‌తో కమల్‌ 233 ఉన్నట్టా.. లేనట్టా?

ABN , Publish Date - Jan 25 , 2024 | 05:17 PM

‘విక్రమ్‌’ సినిమా సక్సెస్‌ తర్వాత జోరు పెంచారు విశ్వనాయకుడు కమల్‌హాసన. వరుస చిత్రాలను ప్రకటించారు. అయితే ఆయన నటించనున్న ఓ  సినిమా గురించి నెట్టింట ప్రచారం జరుగుతోంది. నిర్మాణ సంస్థ రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌ ఈ ప్రచారానికి మరింత బలాన్నిస్తుంది.

Kamal haasan: హెచ్.వినోద్‌తో కమల్‌ 233 ఉన్నట్టా.. లేనట్టా?


‘విక్రమ్‌’ (Vikram) సినిమా సక్సెస్‌ తర్వాత జోరు పెంచారు విశ్వనాయకుడు కమల్ హాసన్(Kamal haasan). వరుస చిత్రాలను ప్రకటించారు. అయితే ఆయన నటించనున్న ఓ  సినిమా గురించి నెట్టింట ప్రచారం జరుగుతోంది. నిర్మాణ సంస్థ రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌ ఈ ప్రచారానికి మరింత బలాన్నిస్తుంది. కమల్ హాసన్  హోం బ్యానర్‌ రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై హెచ్‌.వినోద్‌ దర్శకుడిగా ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే! కమల్‌హాసన్‌ 233వ (kamal 233)చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌గా ప్రచారంలో ఉంది. కమల్‌ను దృష్టిలో ఉంచుకుని వినోద్‌ పవర్‌ఫుల్‌  పాత్ర సిద్థం చేసినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ చిత్రం ఆగిపోయిందని జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ నేపథ్యంలో తమ బ్యానర్‌లో రానున్న చిత్రాలను ఉద్దేశించి రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బుధవారం ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేసింది. అది కమల్‌హాసన్‌ 233వ చిత్రం ఆగిపోయిందనే వార్తకు బలానిచ్చింది. ఆ ట్వీట్‌లో ‘థగ్‌ లైఫ్‌’, ‘కమల్‌ 237’, ‘శివకార్తికేయన్‌ 21’, ‘శింబు 48’ త్వరలో తమ బ్యానర్‌ నుంచి విడుదల కానున్నట్లు తెలిపారు. ఆ లిస్ట్‌లో కమల్‌ 233 సినిమా గురించి ఆ లిస్ట్‌లో లేకపోవడంతో ఇది ఆగిపోయిందని, అందుకే దాని గురించి ప్రస్తావన చేయలేదని నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కథనాలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన లేదు. 


Updated Date - Jan 25 , 2024 | 05:17 PM