Kalki 2898 AD New look: దీపికా బర్త్‌డే.. డార్లింగ్‌ ఏమన్నారంటే! 

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:29 PM

ప్రభాస్‌ హీరోగా పాన్  ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం 'కల్కి 2898 ఎడీ’. బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొనె కథానాయిక. నాగ్‌ అశ్విన్  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో  దీపికా తెలుగుతెరకు పరిచయం అవుతున్నారు.

Kalki 2898 AD New look: దీపికా బర్త్‌డే.. డార్లింగ్‌ ఏమన్నారంటే! 

ప్రభాస్‌ హీరోగా పాన్  ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం 'కల్కి 2898 ఎడీ’. బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొనె కథానాయిక. నాగ్‌ అశ్విన్  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో  దీపికా తెలుగుతెరకు పరిచయం అవుతున్నారు. శుక్రవారం హీరోయిన్ దీపిక పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం బృందం ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు సీరియస్‌గా కనిపిస్తున్న దీపిక లుక్‌ అదరహో అనేలా ఉంది. ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీపికాకు నెటిజన్లు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతే కాదు పాన్ ఇండియా  స్టార్‌ ప్రభాస్‌ కూడా దీపికాకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఇన్స్టా గ్రామ్‌లో స్టేటస్‌ పెట్టారు. 

Untitled-3.jpg

ప్రభాస్‌, దీపికా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన, విశ్వనాయకుడు కమల్‌హాసన కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో తాజా షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. దక్షిణాది భాషలతోపాటు హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 


Updated Date - Jan 05 , 2024 | 04:29 PM