Kadhalikka NeramIllai: షూటింగ్‌ పూర్తి చేసుకున్న.. జయం రవి, నిత్యా మేనన్ చిత్రం

ABN , Publish Date - May 30 , 2024 | 10:28 AM

జయం రవి, నిత్యా మేనన్ జంట‌గా న‌టిస్తోన్న కొత్త చిత్రం ‘కాదలిక్క నేరమిల్లై’. రెడ్‌ జెయింట్‌ మూవీస్ పతాకంపై కృతిక ఉయదనిధి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

Kadhalikka NeramIllai: షూటింగ్‌ పూర్తి చేసుకున్న.. జయం రవి, నిత్యా మేనన్ చిత్రం
jayam ravi

జయం రవి (Jayam Ravi), నిత్యా మేనన్ (NithyaMenon ) జంట‌గా న‌టిస్తోన్న కొత్త చిత్రం ‘కాదలిక్క నేరమిల్లై’ (Kadhalikka NeramIllai). రెడ్‌ జెయింట్‌ మూవీస్ (Red Giant Movies) పతాకంపై కృతిక ఉయదనిధి (Kiruthika Udhayanithi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. యోగిబాబు, లాల్‌, వినయ్‌, లక్ష్మీ రామకృష్ణన్‌, గాయకుడు మనో, టీజే భాను, జాన్‌ కొకన్‌, వినోదిని ఇతర పాత్రల్లో న‌టించారు.

GAFFkDzWsAAfVuy.jpeg


సహ నిర్మాతలు ఎం.షెణ్బగమూర్తి, ఆర్‌.అర్జున్‌ దురై. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ నిర్మాణ పనులను కూడా పూర్తి చేసి త్వరలోనే ఆడియో, ట్రైలర్‌ రిలీజ్‌ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్‌.రెహ్మాన్ (A.R.Rahman) సంగీతం అందిస్తున్నారు.

GOp68vvXQAAVNy9.jpeg

Updated Date - May 30 , 2024 | 12:59 PM