Vanangaan: అరుణ్‌ విజయ్ హీరోగా.. బాలా మ‌రో నాటు సినిమా! శివ‌పుత్రుడిని మించి

ABN , Publish Date - Jul 08 , 2024 | 08:39 AM

త‌మిళ ద‌ర్శ‌కుడు బాలా దర్శకత్వంలో అరుణ్‌ విజయ్ హీరోగా నటించిన చిత్రం ‘వణంగాన్‌’. విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా సినిమా ట్రైలర్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు.

Arun Vijay

కాస్త గ్యాప్ త‌ర్వాత ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు బాలా (BALA) దర్శకత్వం వ‌హించ‌గా అరుణ్‌ విజయ్ (Arun Vijay) హీరోగా నటించిన చిత్రం ‘వణంగాన్‌’ (Vanangaan). ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఈ క్ర‌మంలో సినిమా ట్రైలర్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. ఈనెల 8న సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నట్టు హీరో అరుణ్‌ విజయ్ తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు.

Arun Vijay

అయితే మొద‌ట ఈ సినిమాలో హీరో సూర్య నటించాల్సి ఉంది. షూటింగ్ మొద‌లెట్టి సూర్యతో కొన్ని సీన్లు తీయ‌డ‌మే కాక ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు. తెలుగులో అచ‌లుడు (Achaludu) అనే పేరు కూడా పెట్టారు. అయిన‌ప్ప‌టికీ బిజీ షెడ్యూల్‌ కారణంగా సూర్య తప్పుకోవడంతో అరుణ్ (Arun Vijay) విజయ్‌కు ఈ అవకాశం దక్కింది.


ఆ త‌ర్వాత మ‌ర‌లా హీరో అరుణ్‌విజయ్‌ (Arun Vijay) ఒక చేతిలో పెరియార్‌, మరో చేతిలో వినాయకుడి విగ్రహాలను పట్టుకుని ఉన్న కొత్త లుక్ విడుద‌ల చేయ‌గా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. రెండు నెల‌ల క్రితం రిలీజ్ చేసిన టీజ‌ర్ కూడా సినిమాపై బ‌జ్‌ను క్రియేట్ చేసింది. ఆ టీజ‌ర్‌ను చూస్తే శివ‌పుత్రుడు 2 మించి అనేలా ఉండ‌డం విశేషం.

Arun Vijay

రోషిణిప్రకాష్ (Roshini Prakash) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సీనియర్‌ దర్శకుడు మిష్కిన్ ( Mysskin) కీలక పాత్రను పోషించారు. జీవీ ప్రకాశ్‌కుమార్ (G.V.Prakash Kumar) సంగీతం అందించారు.

Arun Vijay

కన్నియాకుమారి, తిరువణ్ణామలై జిల్లాల్లో షూటింగ్‌ పూర్తి చేసి, నిర్మాణాంతర పనులు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్టు తన ట్విటర్‌ ఖాతాలో అరుణ్‌ విజయ్ (Arun Vijay) వెల్లడించారు.

Arun Vijay

Updated Date - Jul 08 , 2024 | 08:39 AM