‘ఇసైజ్ఞాని’ అనే పేరుకు అర్హుడినా?: ఇళయరాజా ప్రశ్న

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:50 PM

తనను ‘ఇసైజ్ఞాని’ అని పిలుస్తుంటారని, నిజానికి ఆ పేరుకు తాను అర్హుడినా అంటే తనకే ప్రశ్నార్థకంగా ఉంటుందని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. చెన్నైలో జరిగిన ఒక పుస్తకావిష్కరణలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ‘ఇసైజ్ఞాని’ పేరుకి అర్హుడిని కాదని ఇళయరాజా చెప్పుకొచ్చారు.

‘ఇసైజ్ఞాని’ అనే పేరుకు అర్హుడినా?: ఇళయరాజా ప్రశ్న
Ilaiyaraaja

తనను ‘ఇసైజ్ఞాని’ (Isaignani) అని పిలుస్తుంటారని, నిజానికి ఆ పేరుకు తాను అర్హుడినా అంటే తనకే ప్రశ్నార్థకంగా ఉంటుందని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) అన్నారు. చెన్నైలో జరిగిన ఒక పుస్తకావిష్కరణలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘నాకు భాష, సాహిత్య పరిజ్ఞానం లేదు. నేను తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రంలో హీరోయిన్‌ నడిచి వచ్చే సన్నివేశానికి నేపథ్య సంగీతం అందించాను. ఆ హీరోయిన్‌లో ఆండాళ్‌ను చూశాను. అందుకేనేమో ఆ ఆండాళ్‌ ఆశీర్వాదం లభించినట్టుగా భావిస్తాను. నేను శివ భక్తుడిని. కానీ, ఏ ఒక్కదానికి వ్యతిరేకం కాదు. కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టలేదు. కానీ, ప్రజలు నన్ను ఇసైజ్ఞాని అని పిలుస్తున్నారు. నేను అలా భావించడం లేదు. గర్వాన్ని చిన్న వయసులోనే వదిలేశా. అన్నతో కలిసి కచేరిలకు వెళ్లే సమయంలో హార్మోనియం వాయించేవాడిని. ప్రేక్షకులు చప్పట్లుకొడుతూ అభినందించేవారు. ఆ సమయంలో ఎంతో గర్వంగా ఉండేది. ఆ తర్వాత సాధన చేసి అనేక చిత్రాలకు వాయించాను. కొంతకాలానికి ఈ అభినందనలు నాకు కాదు నేను సృష్టించే బాణీలకు ఈ కరతాళధ్వనులు వస్తున్నాయని తెలుసుకున్నా. మనకు ఏ విషయంతో సంబంధం లేదని గ్రహించాను. అందుకే పేరు ప్రఖ్యాతల గురించి ఆలోచించడం మానేశా’’ అని అన్నారు. (Ilaiyaraaja Comments on Isaignani)


Ilaiyaraaja.jpg

ఆయన అలా చెప్పినప్పటికీ.. ఇళయరాజా ‘ఇసైజ్ఞాని’నే అని అంతా అంటారు, పిలచుకుంటారు. ప్రజలు మీరిచ్చే బాణీలకు అభినందిస్తున్నారని మీరనుకుంటున్నారు.. కానీ, ఆ బాణీల సృష్టికర్త మీరేననే విషయం మరిచిపోతున్నారు. మీరు సృష్టిస్తేనే కదా.. ఏ బాణీ అయినా.. శ్రోతలకు చేరిది. అసలు మీ సంగీతం లేకపోతే.. ఒక జనరేషన్ ఏమయ్యేదో.. అనే భావన ఇప్పటికీ జనాల్లో ఉందని గమనించాలి సార్.. అంటూ ఇళయరాజా కామెంట్స్‌‌కి అభిమానులు బదులిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*కెప్టెన్‌ నివాసానికి క్యూకడుతున్న సినీ ప్రముఖులు.. ఇప్పుడెందుకు వస్తున్నారంటూ..?

*************************

*Anjali: ముద్దుగా కనిపించినా.. నా పనులు అలా ఉంటాయి

***********************

*Director Vijay Binni: ‘నా సామిరంగ’లో చాలా సర్‌ప్రైజ్‌లున్నాయ్..

**************************

*RC16: ఆయనే.. అధికారికంగా ప్రకటించేశారు

***********************

Updated Date - Jan 07 , 2024 | 04:50 PM