మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

GV Prakash: స్నేహితుల మధ్య అవన్నీ కామన్..

ABN, Publish Date - Apr 06 , 2024 | 05:02 PM

తమిళ హీరో ధనుష్‌, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్‌ ఎన్నో ఏళ్ల నుంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ధనుష్‌ హీరోగా నటించిన ‘మయక్కం ఎన్నా’, ‘ఆడుకలమ్‌’, ‘కెప్టెన్‌ మిల్లర్‌’ చిత్రాలకు జి.వి. సంగీతం అందించారు

తమిళ హీరో ధనుష్‌(Dhanush), సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్‌ (Gv Prakash) ఎన్నో ఏళ్ల నుంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ధనుష్‌ హీరోగా నటించిన ‘మయక్కం ఎన్నా’, ‘ఆడుకలమ్‌’, ‘కెప్టెన్‌ మిల్లర్‌’ చిత్రాలకు జి.వి. సంగీతం అందించారు. వీరిద్దరి మధ్య మాటల్లేవని గతంలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై జీవీ ఓ సందర్భంలో స్పందించారు. స్నేహితుల మధ్య గొడవలు సహజం అని చెప్పారు. ‘‘కష్టం, సుఖం.. ఇలా ఏ సమయంలోనైనా ధైర్యంగా నిలిచే వ్యక్తి స్నేహితుడు. అలాంటి వారు అందరికీ ఉంటారు. స్నేహితులన్నాక మనస్పర్థలు రావడం సహజం. ఆ సమయంలో అవసరమైనప్పుడు పరస్పరం అర్థం చేసుకోవడం అవసరం. అందరూ తప్పుకుంటున్నట్లు నిజమే మేము దాదాపు ఆరేళ్లు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత మా మధ్య పరిస్థితులు చక్కబడ్డాయి. మా బంధం మరింత బలపడింది. ధనుష్‌ ఎంతో మంచి వ్యక్తి. ఇష్టమైన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అతడితో క్రికెట్‌ ఆడటం నాకు ఇష్టం.’’ అని అన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 05:02 PM