Meetha Raghunath: పెళ్లి చేసుకున్న.. యూత్ కలల రాణి!
ABN , Publish Date - Mar 18 , 2024 | 03:11 PM
గత సంవత్సరం ఓటీటీలో వచ్చిన గుడ్‌నైట్ అనే తమిళ డబ్బింగ్ సినిమాతో తెలుగులోనూ మంచి పేరు సంపాదించుకున్న మీతా రఘునాథ్ వివాహం ఆదివారం తన హోమ్‌టౌన్ ఊటీలో బంధువుల సమక్షంలో వైభవంగా జరిగింది.
 
                                    
గత సంవత్సరం ఓటీటీలో వచ్చిన గుడ్‌నైట్ (Good Night) అనే తమిళ డబ్బింగ్ సినిమాతో తెలుగులోనూ మంచి పేరు సంపాదించుకున్న మీతా రఘునాథ్ (Meetha Raghunath) వివాహం ఆదివారం తన హోమ్‌టౌన్ ఊటీలో బంధువుల సమక్షంలో వైభవంగా జరిగింది. గత సంవత్సరం నవంబర్‌లోనే వీరి ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కేరీర్ బలపడుతున్న సమయంలో మీతా ఇలా పెళ్లి పీట లెక్కడంతో చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

2022లో సినిమాల్లోకి అడుగుపెట్టిన మీతా రఘునాథ్ (Meetha Raghunath) చేసింది రెండు సినిమాలే అయినా గుడ్‌నైట్ సినిమా ఓటీటీలోకి వచ్చాక ఒక్కసారిగా ఓవర్‌నైట్ స్టార్‌గా మారి తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది.

గురక పెట్టే భర్తతో ఓ భార్య, కుటుంబం పడ్డ ఇబ్బందుల నేపథ్యంలో తెరకెక్కిన గుడ్‌నైట్ (Good Night) సినిమాలో గర్ల్ నెక్స్ట్ డోర్ పాత్రలో మన పక్కింటి అమ్మాయిలా అమాయకత్వం ఉట్టిపడేలా చాలా సహాజంగా నటించి అందరినీ మెప్పించింది. కుర్రకారుతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ సైతం ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు.

ఈ సినిమా చూసిన చాలామంది మీతా రఘునాథ్ (Meetha Raghunath) రూపంలో సౌత్‌కు మరో సావిత్రి, సౌందర్య లభించింది మంచి పాత్రలు పడతాయి అనే సమయానికి గత నవంబర్‌లో తన చిరకాల మిత్రుడితో పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చింది.

అ వేడుక పూర్తైన నాలుగు నెలల తర్వాత నిన్న( ఆదివారం) కొద్దిమంది బంధువుల సమక్షంలోనే పెళ్లి చేసుకుని ఓ ఇంటివారయ్యారు. ఈ విషయం తెలిసిన చాలామంది సెలబ్రిటీస్ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.