scorecardresearch

Gautham Vasudev Menon: మనశ్శాంతి కరువైంది.. చాలా బాధను అనుభవిస్తున్నా

ABN , Publish Date - Feb 28 , 2024 | 05:58 PM

క‌ర్ణుడి చావుకు వెయ్యి కార‌ణాలు అన్న‌ట్లుగా త‌యారైంది దృవ న‌క్ష‌త్రం సినిమా ప‌రిస్థితి. డైరెక్ట‌ర్ గౌత‌మ్ వాసుదేవ్ మీనన్ ఏ మూహుర్తానా ఈ సినిమా నిర్మాణం మోద‌లు పెట్టాడో గానీ ఓ అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. తాజాగా దృవ న‌క్ష‌త్రం సినిమా విడుదలపై గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరోసారి మాట్లాడుతూ చాాలా బాధ పడ్డారు.

Gautham Vasudev Menon: మనశ్శాంతి కరువైంది.. చాలా బాధను అనుభవిస్తున్నా
gautham vasudev menon

క‌ర్ణుడి చావుకు వెయ్యి కార‌ణాలు అన్న‌ట్లుగా త‌యారైంది దృవ న‌క్ష‌త్రం (Dhruva Natchathiram) సినిమా ప‌రిస్థితి. అప్పుడెప్పుడో 2013లో మొద‌లైన ఈ సినిమా ద‌శాబ్దం అయినా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి గ‌ర్భం నుంచి శిశువు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు త‌ల్లి ప‌డే పురిటి నోప్పుల బాధ‌లు ప‌డుతున్న‌ది. డైరెక్ట‌ర్ గౌత‌మ్ వాసుదేవ్ మీనన్(Gautham vasudev menon) ఏ మూహుర్తానా ఈ సినిమా నిర్మాణం మోద‌లు పెట్టాడో గానీ ఓ అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది పరిస్థితి. మరి కొంత కాలం ఈ సినిమాకు తిప్ప‌లు త‌ప్పేలా లేవు.

తాజాగా దృవ న‌క్ష‌త్రం సినిమా విడుదలపై గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరోసారి మాట్లాడుతూ చాాలా బాధ పడ్డారు. ఈ చిత్రం పదేపదే వాయిదా పడుతూ వస్తుండడంతో దశాబ్ద కాలంగా ఎవరికీ చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నానని, నా భార్యకు నాకు నిద్ర, మనశ్శాంతి కరువైందని, జీవితంపై విరక్తి వచ్చేసిందని, కొంతకాలం ఎటైనా వెళ్లాలని అనుకున్నప్పటికీ నేను జవాబు చెప్పాల్సిన వారు, ఫైనాన్షియర్ ఉన్నారని ఆగి పోయానని ఎమోషనల్ అయ్యారు.

Dhruva-Natchathiram-Chapter1.jpg

అయితే.. గతంలో గౌతమ్ మీనన్ శింబు కాంబినేషన్ లో ప్రారంభమైన ఓ సినిమాకు డబ్బులు తీసుకుని ఆ చిత్రాన్ని పూర్తి చేయక పోవడంతో ఓ నిర్మాత కోర్టుకెక్కాడు. ఆ డబ్బు తిరిగి చెల్లించేంత వరకు ‘ధృవ నక్షత్రం’ చిత్రాన్ని వాయిదా వేయాలని చైన్నై హైకోర్టులో పిటీషన్ వేయడంతో అప్పటి నుంచి ‘ధృవ నక్షత్రం’ చిత్రం విడుదలవకుండా వాయిదాలు పడుతూ వస్తోంది. ఇంకెంత సమయం పడుతుందో వేచి చూడాల్సిందే.


సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ 2013లో సూర్యా (Suriya)తో ఈ చిత్రాన్ని మొదలుపెట్టగా ఆ త‌ర్వాత వాళ్లిద‌రి మ‌ధ్య గ్యాప్ రావడంతో 2015లో జయం రవితో 2017లో విక్రమ్ (ChiyaanVikram)తో హీరోగా షూటింగ్ చేశారు. ఈ క్ర‌మంలో త్రిష, నయనతార, సమీరారెడ్డి, అసిన్, అమలాపాల్, అను ఇమ్మాన్యుయేల్ అంటూ అర డజన్ మంది కథానాయికలు మారినప్పుడల్లా మళ్లీ మళ్లీ రీ షూట్లు చేస్తూ చివరకి తెలుగమ్మాయి రీతూ వర్మతో సినిమా పూర్తి చేశారు. అదేవిధంగా ఏఆర్ రెహమాన్ స్థానంలో హరీశ్ జయరాజ్(Harris Jayaraj ), ప్రతి నాయకుడిగా విక్రమన్ వచ్చి చేరారు.

RITU.jpg

ఇదిలా ఉండగా.. 2018లోనే సినిమా విడుదల ఉంటుందని చెబుతూ వచ్చిన యూనిట్ పోస్ట్ ప్రోడక్షన్ ఇష్యూతో వాయిదా పడింది. ఇక అప్పటినుంచి ప్రతి సంవత్సరం విడుదల తేదీలు మూర్చుకుంటూ రావడం అనవాయితీగా వచ్చి ఫైనల్ గా 2023 దిపావళికి రిలీజ్ అని అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాక మరోసారి వాయిదా పడింది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు, నిర్మాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham vasudev menon) అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఎమోషనల్ అవుతూ ఓ లేఖ విడుదల చేశారు. 2023 డిసెంబర్ 8న విడుదల చేస్తామని ప్రకటించినా ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు.

Updated Date - Feb 28 , 2024 | 05:58 PM