KS Ravi Kumar: గతంలో బాలయ్యపై.. ఇప్పుడు రజనీపై..

ABN , Publish Date - Oct 07 , 2024 | 01:26 PM

తనకు అవకాశాలిచ్చిన హీరోలపై వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటారు తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ .

KS Ravi Kumar: గతంలో బాలయ్యపై.. ఇప్పుడు రజనీపై..

తనకు అవకాశాలిచ్చిన హీరోలపై వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటారు తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ (KS Ravikumar). గతంలో బాలకృష్ణ (balakrishna)వ్యక్తిత్వం గురించి రెండు సందర్భాల్లో రెండు రకాలుగా మాట్లాడి సోషల్ మీడియాలో విమర్శలు పాలయ్యారు. తాజాగా రజనీకాంత్ పై కె.ఎస్ రవికుమార్ అదే తీరును ప్రదర్శించారు. తమ కాంబోలో వచ్చిన 'లింగ' (linga movie) చిత్రం  ఎడిటింగ్లో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారంటూ  ఓ ఇంటర్వ్యూలో రవికుమార్ కామెంట్స్ చేశారు. (KS Ravikumar comments on (Rajinikanth)


కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌పై దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ ఆరోపణలు చేశారు. ులింగ’ సినిమా ఎడింటింగ్‌లో రజనీ జోక్యం చేసుకున్నారనీ, చాలా మార్పులు చేశారని ఆయన ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన మాట్లాడుతూ ుూలింగ ఎడిటింగ్‌ విషయంలో రజనీ జోక్యం చేసుకున్నారు. గ్రాఫిక్స్‌ కోసం నాకు అసలు సమయం ఇవ్వలేదు. ద్వితీయార్థం మొత్తం మార్చేశారు. అనుష్కతో ఉండే ఒక పాట, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను పూర్తిగా తొలగించారు. కృత్రిమంగా ఉండే బెలూన్‌  జంపింగ్‌ సీన్‌ యాడ్‌ చేశారు. లింగ సినిమాను గందరగోళం చేశారు’’అని రవికుమార్‌ వ్యాఖ్యలు చేశారు. మంచి దర్శకుడనే గుర్తింపు ఆయనకు ఉంది. గతంలో రజనీకాంత్‌తో  ముత్తు, నరసింహ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు తీశారు. కొంత గ్యాప్‌ తర్వాత 2014లో వీరిద్దరి కాంబోలో లింగ చిత్రం వచ్చింది. రజనీకాంత్‌ డ్యూయల్‌ రోల్‌ చేయగా, అనుష్క, సోనాక్షి సిన్ణ నాయికలుగా నటించారు. అప్పట్లో దాదాపు రూ.150 కోట్లు వసూళ్లు రాబట్టినప్పటికీ పరాజయం పాలైంది. 2016లో ఇదే సినిమా గురించి రవికుమార్‌ మాట్లాడుతూ వరల్డ్‌ వైడ్‌ మా సినిమా 150 కోట్లు వసూళ్లు రాబట్టింది. అది మామూలు విషయం కాదు. కలెక్షన్ల పరంగా సినిమా సూపర్‌హిట్‌ అని అన్నారు. ఇప్పుడేమో 'లింగ' పరాజయానికి రజనీకాంత్‌ కారణమని చెబుతున్నారు రవికుమార్‌.

ప్రస్తుతం రజనీకాంత్‌ చేతిలో వరుస చిత్రాలున్నాయి. 'వేట్టయాన్‌' దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'కూలీ’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. 'జైలర్‌-2' త్వరలో సెట్స్‌ మీదకెళ్లనుంది. అయితే ఇటీవల తలైవా అస్వస్థతకు గురి కావడంతో చిన్నపాటి సర్జరీ చేశారు. వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. 

Updated Date - Oct 07 , 2024 | 01:30 PM