Raayan: ధ‌నుష్.. ఇది అస‌లు నువ్వేనా! ఏంటీ సామీ.. ఈ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌

ABN , Publish Date - Feb 19 , 2024 | 09:02 PM

త‌మిళ, తెలుగు భాష‌ల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న న‌టుడు ధ‌నుష్. కెప్టెన్ మిల్ల‌ర్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ వంటి హిట్ త‌ర్వాత చేస్తున్న చిత్రం రాయన్ సినిమా టైటిల్‌ను సోమ‌వారం సాయంత్రం ప్ర‌క‌టించారు.

Raayan: ధ‌నుష్.. ఇది అస‌లు నువ్వేనా! ఏంటీ సామీ.. ఈ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌
dhanush rayaan

త‌మిళ, తెలుగు భాష‌ల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న న‌టుడు ధ‌నుష్ (Dhanush). కెప్టెన్ మిల్ల‌ర్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ వంటి హిట్ త‌ర్వాత చేస్తున్న చిత్రం రాయన్ (Raayan). డీ 50 గా వ‌స్తున్న ఈ సినిమా టైటిల్‌ను ఈ రోజు (సోమ‌వారం) సాయంత్రం ప్ర‌క‌టించారు.

GGtO5YRbIAE2AzD.jpg

స‌న్ పిక్చ‌ర్స్ (Sun Pictures) నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వ‌యంగా ధ‌నుషే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా సందీప్ కిష‌న్ (Sundeep Kishan) , కాళిదాస్ (kalidas jayaram), ఎస్‌జే సూర్య‌, ఆప‌ర్ణ బాల ముర‌ళి, అనైక సురేంద్ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.


screenshot49899-1695542353.jpg

గ‌త డిసెంబ‌ర్‌లోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగా తాజాగా సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ఈ లుక్‌లో ధ‌నుష్‌తో పాటు సందీప్ కిష‌న్ (Sundeep Kishan), కాళిదాస్ (kalidas jayaram) మంచి యాక్ష‌న్ మోడ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. చెన్నైలో గ్యాంగ్ స్ట‌ర్ నేప‌థ్యంలో ఈ సినిమా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ప‌వ‌ర్ పాండి అనే సినిమాకు ద‌ర్శ‌కత్వం చేసిన ధ‌నుష్ (Dhanush) మ‌ళ్లీ ఇన్నాళ్లకు ఈ రాయన్ (Raayan) చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించడం విశేషం. త్వ‌ర‌లో మ‌రో చిత్రాన్ని కూడా ధ‌నుష్ డైరెక్ట్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

gg5qy6ctzdab1.jpg

ఏఆర్ రెహ‌మాన్ (A.R.Rahman) సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో తీసుకు వ‌స్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం ధ‌నుష్ గుడ్డు కొట్టించుకున్న‌ట్లు తెలుస్తోండ‌గా ఆ స్టిల్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు ఫొటోలో ఉన్న‌ది నువ్వేనా ఏంటీ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌ అంటూ సినీ అభిమానులు ఆశ్చ‌ర్య పోతున్నారు.

GGilA4raAAAhbm5.jpg

Updated Date - Feb 19 , 2024 | 09:19 PM