Thangalaan: రూ.100 కోట్ల క్లబ్‌లో.. విక్రమ్ ‘తంగలాన్‌’

ABN, Publish Date - Sep 02 , 2024 | 05:16 PM

పా.రంజిత్ దర్శకత్వంలో చియాన్‌ విక్రమ్ హీరోగా నటించిన ‘తంగలాన్‌’ చిత్రం రూ.100 కోట్ల వసూళ్ళను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు తదితర భాషల్లో ఈ కలెక్షన్స్‌ రాబట్టినట్టు నిర్మాణ సంస్థలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Thangalaan: రూ.100 కోట్ల క్లబ్‌లో.. విక్రమ్ ‘తంగలాన్‌’
Thangalaan

పా.రంజిత్ (Pa Ranjith) దర్శకత్వంలో చియాన్‌ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా నటించిన ‘తంగలాన్‌’ (Thangalaan) చిత్రం రూ.100 కోట్ల వసూళ్ళను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు తదితర భాషల్లో ఈ కలెక్షన్స్‌ రాబట్టినట్టు నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ (Studio Green), నీలం ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

బడా నిర్మాత కేఈ ఙ్ఞానవేల్‌ రాజా (KE Gnanavel Raja) భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్ (Chiyaan Vikram), పార్వతి (Parvathi), మాళవిక మోహన్ (Malavika Mohanan), పశుపతి, డేనియల్‌ కాల్టాడిరోన్‌ తదితరులు నటించారు. కోలార్‌ బంగారు గనుల నేపథ్యంలో అణగారిన ప్రజల వాస్తవికతను, జీవన, హక్కుల పోరాటంపై ఈ సినిమా సాగుతుంది. జీవీ ప్రకాష్‌ కుమార్ (G V Prakash Kumar) సంగీతం అందించారు.

Thangalaan.jpg

ఈ మూవీ ఈ నెల 15వ తేదీన విడుదలైన విషయం తెల్సిందే. తొలి రోజునే ప్రపంచ వ్యాప్తంగా రూ.26 కోట్ల మేరకు వసూళ్ళను రాబట్టి.. చియాన్‌ విక్రమ్‌ సినీ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇదిలావుంటే, ఈ సినిమా హిందీ వెర్షన్‌ను సెప్టెంబరు ఆరో తేదీన విడుదల చేయనున్నారు.

Updated Date - Sep 02 , 2024 | 05:16 PM