Vadakkan: టైటిల్‌ మారిస్తేనే సర్టిఫికెట్‌.. ఆ సినిమాకు సెన్సార్ షాక్

ABN , Publish Date - May 27 , 2024 | 09:30 AM

రచయిత భాస్కర్‌ శక్తి దర్శకుడిగా అవతారమెత్తి రూపొందించిన చిత్రం ‘వడక్కన్‌’( చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవ‌ల‌ సెన్సార్‌కు వెళ్ళగా, అక్కడ సమస్యలు ఎదురయ్యాయి.

Vadakkan: టైటిల్‌ మారిస్తేనే సర్టిఫికెట్‌.. ఆ సినిమాకు సెన్సార్ షాక్
Vadakkan

రచయిత భాస్కర్‌ శక్తి (bhaskar sakthi) దర్శకుడిగా అవతారమెత్తి రూపొందించిన చిత్రం ‘వడక్కన్‌’(Vadakkan). చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవ‌ల‌ సెన్సార్‌కు వెళ్ళగా, అక్కడ సమస్యలు ఎదురయ్యాయి. ‘వడక్కన్‌’ టైటిల్‌కు సెన్సార్‌ బోర్డు (Censor Board) సభ్యులు అభ్యంతరం తెలిపారు. తమిళనాడుకు ఉపాధి కోసం వలస వచ్చే ఉత్తరాది వలస కార్మికుల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని రూపొందించారు.

2012789-vadakkan.webp

ఇటీవల సినిమాను చూసిన సెన్సార్‌ బోర్డు (Censor Board) సభ్యులు.. టైటిల్‌ మారిస్తేనే సర్టిఫికెట్‌ ఇస్తామని తేల్చి చెప్పారు. ఉత్తర భారతీయులను కించపరిచేలా ఈ టైటిల్‌ ఉందని అందువల్ల పేరు మార్చాలని సూచించారు. సెన్సార్‌ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిత్ర బృందం అప్పీల్‌ చేసినట్టు సమాచారం.


GM6YT6UWEAA9TLF.jpeg

ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన విడుదలకావాల్సిన ఈ చిత్రాన్ని మరో తేదీకి వాయిదా వేశారు. ఈ మూవీలో కుంకుమ్‌ రాజ్ (Kunguma Raj), వైరమాలా (Vairamala), ప్రవేశ్‌ మెహ్రూ, సమీరా తదితరులు నటించగా డిస్కవరీ సినిమాస్ (Discovery Cinemas)పతాకంపై ఎం.వేడియప్పన్ (vediyappan) నిర్మించారు

Updated Date - May 27 , 2024 | 09:36 AM