OTT- Captain Miller: పెద్ద హీరో సినిమాను రెండో స్థానానికి నెట్టి.. మొదటిస్థానంలో!

ABN , Publish Date - Feb 11 , 2024 | 09:02 PM

కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌ నటించిన చిత్రం కెప్టెన్‌ మిల్లర్‌. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలి షో నుంచి పాజిటివ్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద చక్కని వసూళ్లు రాబట్టింది.

OTT- Captain Miller: పెద్ద హీరో సినిమాను రెండో స్థానానికి నెట్టి.. మొదటిస్థానంలో!


కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌ (Dhanush) నటించిన చిత్రం కెప్టెన్‌ మిల్లర్‌ (Captain miller). సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలి షో నుంచి పాజిటివ్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద చక్కని వసూళ్లు రాబట్టింది. సంక్రాంతికి థియేటర్ల వద్ద పోటీ నెలకొనడంతో జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. టాలీవుడ్‌లోనూ ఈ చిత్రం చక్కని ఆదరణ పొందింది. ప్రస్తుతం ఓటీటీలో కూడా ఈ చిత్రం సందడి చేస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్  అవుతోంది. ఓటీటీలోనూ  అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

ఓటీటీలో వచ్చిన రెండో రోజే టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది. టాలీవుడ్‌ హీరో వెంకటేశ్‌ నటించిన సైంధవ్‌ మూవీని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. ఈ చిత్రం అమెజానలో మొదటి స్థానంలో ట్రెండ్‌ అవుతుండగా.. రెండో స్థానం 'సైంధవ్‌', మూడో ప్లేస్‌లో సల్మాన్‌ ఖాన్‌ 'టైగర్‌-3' ఉంది. కెప్టెన మిల్లర్‌ చిత్రాన్ని అరుణ్‌ మాతీశ్వరన్‌ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్‌ హీరో సందీప్‌ కిషన్‌ కీలక పాత్ర పోషించారు. 

Updated Date - Feb 11 , 2024 | 09:02 PM