Bobby deol: క్రూరమైన, శక్తిమంతమైన, మర్చిపోలేని పాత్ర! 

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:29 PM

బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ ఇటీవల విడుదలైన ‘యానిమల్‌’లో విలన్‌ పాత్రలో నటించి చక్కని ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఆయన సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కంగువా’లో నటిస్తున్నారు. దిశా పటానీ కథానాయిక. శనివారం బాబీ దేవోల్‌  పుట్టిన రోజు.

Bobby deol:   క్రూరమైన, శక్తిమంతమైన, మర్చిపోలేని పాత్ర! 

బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ ఇటీవల విడుదలైన ‘యానిమల్‌’లో విలన్‌ పాత్రలో నటించి చక్కని ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఆయన సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కంగువా’లో నటిస్తున్నారు. దిశా పటానీ కథానాయిక. శనివారం బాబీ దేవోల్‌  పుట్టిన రోజు. సందర్భంగా ఈ సినిమాలో బాబీ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.  ‘క్రూరమైన, శక్తిమంతమైన, మర్చిపోలేని.. ఉధిరన్‌’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. ఇందులో బాబీ భిన్నమైన ఆహార్యంతో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాబీ. యుద్థానికి సిద్ధమవుతున్న ఆయనకు ఆ వర్గ ప్రజలంతా తమ మద్దతు తెలుపుతున్నట్లు తాజా పోస్టర్‌లో కనిపిస్తోంది. సూర్య పుట్టినరోజున విడుదల చేసిన టీజర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు బాబీ లుక్‌తో మరింత క్రేజ్‌ పెరిగింది. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అలాగే బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీకర స్టూడియోస్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో బాబీ దేవోల్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. శనివారం బాబీ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఆయన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.


Updated Date - Jan 28 , 2024 | 12:48 PM