Anushka Shetty: తొలి మలయాళ చిత్రం సెట్‌లో...

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:58 AM

టాలీవుడ్‌ అగ్రతార అనుష్కశెట్టి తెరపై కనిపించి ఆరు నెలలు కావొస్తుంది. గత ఏడాది ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. చిత్రంతో అలరించింది. ఆ తర్వాత స్వీటీ  బయటకు కూడా రాలేదు. అయితే మలయాళంలో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించింది.

Anushka Shetty:  తొలి మలయాళ చిత్రం సెట్‌లో...

టాలీవుడ్‌ అగ్రతార అనుష్కశెట్టి (Anushka shetty) తెరపై కనిపించి ఆరు నెలలు కావొస్తుంది. గత ఏడాది ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. చిత్రంతో అలరించింది. ఆ తర్వాత స్వీటీ  బయటకు కూడా రాలేదు. అయితే మలయాళంలో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించింది. రోజిన్‌ థామస్‌ దర్శకత్వంలో ‘కథనార్‌:ది వైల్డ్‌ సోర్సెరర్‌’ (Kathanar – The Wild Sorcerer) అనే చిత్రం చేస్తోంది. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమాకు ముందే 'కథనార్‌' చిత్రం చేయడానికి అనుష్క శెట్టి ఒప్పుకున్నారు. అనుష్క చేస్తున్న తొలి మలయాళ చిత్రమిది.  సోమవారం సెట్స్‌ మీదకెళ్లింది. ఈ చిత్రం షూటింగ్‌ మొదలై చాలా కాలం అయినా  అనుష్క మాత్రం సోమవారం సెట్‌లో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని దర్శకుడు రోజిన్ థామస్ సోషల్ మీడియా వేదికగా ఫొటోలు షేర్ చేసి చెప్పారు. అనుష్క లాంటి కథానాయిక సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. 

Anushka.jpg

ఆ సినిమా టీమ్‌తో అనుష్క శెట్టి దిగిన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే ఈ సినిమా కోసం అనుష్క బాగా సన్నబడింది. తాజా ఫొటోలో చాలా స్లిమ్‌గా కనిపిస్తోంది. ఈ ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఆ లుక్‌ కోసం స్వీటీ ఎంతగా కష్టపడిందో కూడా తెలుస్తోంది. ఈ చిత్రం కాకుండా తెలుగులో క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఒరిస్సా నేపథ్యంలో ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. ఇటీవల ఒరిస్సాలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది.

Anushka-2.jpg

Updated Date - Mar 12 , 2024 | 11:58 AM