Ajith Kumar: డూప్‌ లేకుండా స్టంట్స్‌.. వీడియో వైరల్‌!

ABN , Publish Date - Apr 04 , 2024 | 06:31 PM

తమిళస్టార్‌ అజిత్‌కు (Ajith kumar) స్టంట్స్‌ అంటే మక్కువ. ఆయన నటించే చాలా చిత్రాల్లో రైడింగ్‌ సన్నివేశాలను డూప్‌ లేకుండా నటిస్తారని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

Ajith Kumar: డూప్‌ లేకుండా స్టంట్స్‌.. వీడియో వైరల్‌!

తమిళస్టార్‌ అజిత్‌కు (Ajith kumar) స్టంట్స్‌ అంటే మక్కువ. ఆయన నటించే చాలా చిత్రాల్లో రైడింగ్‌ సన్నివేశాలను డూప్‌ లేకుండా నటిస్తారని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆయన రిస్క్‌ తీసుకున్న చేసిన ఓ  యాక్షన్  పార్ట్‌ను వీడియోగా నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ప్రస్తుతం అజిత్‌ తన 62వ చిత్రం ‘విదా ముయార్చి’లో (Vidaamuyarchi) నటిస్తున్నారు. గతేడాది నవంబర్‌లో ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించారు. ఆ యాక్షన్‌ సీక్వెన్స్‌లో అజిత్‌ డూప్‌ లేకుండా నటించడంతో ఆయనకు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ షేర్‌ చేసింది. ఆ సీన్లో  తన పక్కన ఉండే వ్యక్తిని కాపాడేందుకు అజిత్‌ వేగంగా కార్‌ డ్రైవ్‌ చేయాలి. డూప్‌ లేకుండా తానే స్వయంగా వెహికల్‌ నడిపారు. దీంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం నుంచి ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు.

ఈ వీడియోను షేర్‌ చేసిన నిర్మాణ సంస్థ ‘ ధైౖర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో..’ అంటూ అజిత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇది చూసిన నెటిజన్లు సినిమాలపై ఆయనకు ఉన్న డెడికేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘హ్యాట్సాఫ్‌’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. మాగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అజిత్‌ సరసన త్రిష నటిస్తున్నారు. 

Updated Date - Apr 04 , 2024 | 06:31 PM