RedFlower Movie: ‘రెడ్‌ఫ్లవర్‌’.. కోలీవుడ్‌లో ఒక గేమ్‌ ఛేంజర్‌

ABN, Publish Date - Aug 12 , 2024 | 12:44 PM

కాళింకాంబాల్‌ పిక్చర్స్‌ పతాకంపై కె.మాణిక్యం భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ‘రెడ్‌ఫ్లవర్‌’ నిర్మాణం పూర్తి చేసుకుని డబ్బింగ్‌ ప్రారంభమైంది.

RedFlower Movie: ‘రెడ్‌ఫ్లవర్‌’.. కోలీవుడ్‌లో ఒక గేమ్‌ ఛేంజర్‌
red flower

కాళింకాంబాల్‌ పిక్చర్స్‌ పతాకంపై కె.మాణిక్యం భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ‘రెడ్‌ఫ్లవర్‌’ (Red Flower,)నిర్మాణం పూర్తి చేసుకుని డబ్బింగ్‌ ప్రారంభమైంది. హీరో విగ్నేష్ (Vignesh) ద్విపాత్రాభినయం చేశారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీకి ఆండ్రూ పాండియన్ కథ సమకూర్చడంతో పాటు దర్శకత్వం వహించారు.

మనీషా జష్నాని హీరోయిన్‌గా, నాజర్‌, వైజీ మహేంద్రన్‌, సురేష్‌ మీనన్‌, జాన్విజయ్‌, అజయ్‌ రత్నం, లీలా శాంసన్‌, తలైవాసల్‌ విజయ్‌, మోహన్‌ రామ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. ఫ్యూచర‌స్టిక్‌ యాక్షన్‌ థీమ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, కాంటెంపరరీ ఎలిమెంట్స్‌తో ఎల్లవేళలా ప్రేమను పంచాలన్న కాన్సెప్టుతో భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీగా రూపొందించారు.


GGDmebWWwAAdqQP.jpeg

ఈ సినిమా గురించి దర్శకుడు ఆండ్రూ పాండ్యన్‌ మాట్లాడుతూ, ‘చిత్రీకరణ పూర్తి చేసుకుని డబ్బింగ్‌ ప్రారంభించాం. ‘రెడ్‌ఫ్లవర్‌’ మంచి కథతో తెరకెక్కించాం. ఈ సినిమా కోలీవుడ్‌లో ఒక గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుంది. త్వరలోనే ఆడియో, ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:43 AM