సాయిపల్లవి యాక్టింగ్ కి, డాన్స్ కు తాను పెద్ద ఫ్యాన్ అని హీరో నితిన్ అన్నారు. 'అమరన్' సక్సెస్ మీటికి హాజరైన ఆయన 'త్వరలో కలిసి పనిచేస్తా అని అనుకుంటున్నా. కానీ మీతో డాన్స్ చేయడం నాకు ఛాలెంజ్ అని తెలుసు. ఎందుకంటే మీరు నన్ను తినేస్తారు. అయినా కాంపిటీషన్ ఇస్తా. అమరన్‌లో మీ యాక్టింగ్ అద్భుతం. అందరూ అనుకుంటున్నట్టే నేషనల్ విన్నింగ్ పర్ఫార్మెన్స్' అని పొగడ్తలతో ముంచెత్తారు.