నందమూరి నటసింహం బాలకృష్ణ డాకు మహారాజ్‌గా అలరించేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి తమన్, దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ హాజరై సందడి చేశారు.