OTT: ఈ వారం ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు, సిరీస్‌లు!

ABN , Publish Date - Feb 12 , 2024 | 03:50 PM

ఫిబ్రవరి నెలలో అప్పుడే మూడో శుక్రవారం వచ్చేసింది. గత శుక్రవారం బాక్సాఫీస్‌ వద్ద ఈగల్‌ లాంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. మరో పక్క ఓటీటీలో సంక్రాంతికి  విడుదలైన చిత్రాలు స్ట్రీమింగ్  అవుతూ అలరిస్తున్నాయి. మరీ ఈ వారం కూడా పలు చిత్రాలు విడుదలకానున్నాయి.

OTT:  ఈ వారం ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు, సిరీస్‌లు!


ఫిబ్రవరి నెలలో అప్పుడే మూడో శుక్రవారం వచ్చేసింది. గత శుక్రవారం బాక్సాఫీస్‌ వద్ద ఈగల్‌ లాంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. మరో పక్క ఓటీటీలో సంక్రాంతికి  విడుదలైన చిత్రాలు స్ట్రీమింగ్  అవుతూ అలరిస్తున్నాయి. మరీ ఈ వారం కూడా పలు చిత్రాలు విడుదలకానున్నాయి. సంక్రాంతికి 'నా సామిరంగ' చిత్రంతో అలరించిన నాగార్జున ఇప్పుడు ఓటీటీ వీక్షకుల ముందుకు రాబోతున్నారు ఆ చిత్రంతోపాటు 10 నెలల తర్వాత వివాదస్పద 'ద  కేరళ స్టోరీ' చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. వీటితోపాలు పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు ఆహుతులను అలరించడానికి రెడీగా ఉన్నాయి.


ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు


నెట్‌ఫ్లిక్స్‌

ఫిబ్రవరి 13: సండర్‌లెండ్‌ టిల్‌ ఐ డీ (వెబ్‌ సిరీస్‌3)

ఫిబ్రవరి 14:

లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ (వెబ్‌ సిరీస్‌6)

ప్లేయర్స్‌ (హాలీవుడ్)

ఫిబ్రవరి 16:

ఐన్‌స్టీన్‌ అండ్‌ ది బాంబ్‌ (హాలీవుడ్‌)

అమెజాన్‌ ప్రైమ్‌

ఫైవ్‌ బ్లైండ్‌ డేట్స్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 13

దిస్‌ ఈజ్‌ మీ.. నౌ (హాలీవుడ్) ఫిబ్రవరి 16

డిస్నీ+హాట్‌స్టార్‌

ఫిబ్రవరి 12: ట్రాకర్‌ (వెబ్‌సిరీస్‌)

ఫిబ్రవరి 14: సబ నయగన్‌ (తమిళ)

ఫిబ్రవరి 15: ఓజ్లర్‌ (మలయాళం)

ఫిబ్రవరి 16: సలార్‌ (హిందీ)

ఫిబ్రవరి 17: నా సామిరంగ  (తెలుగు)

జీ5

ఫిబ్రవరి 14: క్వీన్‌ ఎలిజబెత్‌ (మలయాళం)

ఫిబ్రవరి 16: ది కేరళ స్టోరీ (హిందీ డబ్బింగ్‌)

ఆహా

ఫిబ్రవరి 14: వీరమారి లవ్‌స్టోరీ (తమిళ)

ఆపిల్‌ టీవీ ప్లస్‌

ఫిబ్రవరి 14: ది న్యూ లుక్‌ (వెబ్‌సిరీస్‌)

సోనీ లివ్‌

ఫిబ్రవరి 12: రాయ్‌ సింఘానీ వర్సెస్‌ రాయ్‌సింఘానీ (హిందీ సిరీస్‌)

Updated Date - Feb 12 , 2024 | 03:50 PM