OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!

ABN , Publish Date - Feb 05 , 2024 | 06:01 PM

గత వారం థియేటర్‌లో ఐదు సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి, రెండు చిత్రాలు మినహా మిగిలినవి ఏమీ పెద్దగా ఆకట్టుకోలేదు. వీకెండ్‌లో ఏం సినిమాలు చూడాలా అని, ఓటీటీలో ఏ చిత్రాలు ఉన్నాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!

గత వారం థియేటర్‌లో ఐదు సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి, రెండు చిత్రాలు మినహా మిగిలినవి ఏమీ పెద్దగా ఆకట్టుకోలేదు. వీకెండ్‌లో ఏం సినిమాలు చూడాలా అని, ఓటీటీలో ఏ చిత్రాలు ఉన్నాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలేంటో చూద్దాం. తెలుగులో మహేశ్‌ బాబు గుంటూరు కారం, కోలీవుడ్‌ హీరో ధనుష్‌ నటించిన కెప్టెన్‌ మిల్లర్‌, కన్నడ దర్శన నటించిన కాటేరా స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యాయి.

మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన యాక్షన్‌ డ్రామా ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ర్టీమింగ్‌ అయ్యేందుకు సిద్థమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ర్టీమింగ్‌ కానుంది.

ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’. ప్రియాంక మోహన్‌ కథానాయిక. సందీప్‌ కిషన్‌, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుక్ను ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ నెల 9నుంచి స్ర్టీమింగ్‌ కానుంది.

ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న మరికొన్ని చిత్రాలు

నెట్‌ఫ్లిక్స్‌

ఫిబ్రవరి 8: వన్‌ డే (హాలీవుడ్‌) 

ఫిబ్రవరి 9: భక్షక్‌ (హిందీ సిరీస్‌)

డిస్నీ+హాట్‌స్టార్‌

 ఫిబ్రవరి 9: ఆర్య (హిందీ సిరీస్‌)

బుక్‌ మై షో

ఫిబ్రవరి 5: ఆక్వామెన్‌ (హాలీవుడ్)

ఆహా

ఫిబ్రవరి 9: బబుల్‌గమ్‌ (తెలుగు) 

జియో సినిమా

ఫిబ్రవరి 6: ఎ ఎగ్జార్సిస్ట్‌ (హలీవుడ్) 

ఫిబ్రవరి 7: ది నన్‌2 (హాలీవుడ్) 

ఫిబ్రవరి 8: హలో (వెబ్‌ సిరీస్‌) 

సన్‌నెక్స్ట్‌

ఫిబ్రవరి 9: అయలాన్‌ 

Updated Date - Feb 05 , 2024 | 06:01 PM