Hanuman: ఇది ‘హను-మాన్’ సినిమాకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా?

ABN , Publish Date - Jan 11 , 2024 | 05:13 PM

దేశమంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం హ‌నుమాన్‌. అయితే ఈ సినిమా విడుద‌ల అవుతున్న రోజే మ‌రో హ‌నుమాన్ కూడా విడుద‌ల అవుతున్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు, కాకుంటే ఇది యానిమేష‌న్‌ సిరీస్. కాగా ఈ రెండు ఒకేరోజు ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం యాదృశ్చికంగా జ‌రుగుతోంది.

Hanuman: ఇది ‘హను-మాన్’ సినిమాకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా?
hanu man

మ‌న‌దేశంలో రాముని భ‌క్తులు ఎంత‌మంది ఉన్నారో అంత‌కుమించి హ‌నుమాన్ భ‌క్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు వారితో పాటు దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రం హ‌నుమాన్‌. తేజ స‌జ్జ, అమృత అయ్య‌ర్ జంట‌గా ప్ర‌శాంత్‌ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ప్రశాంత్ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో భాగంగా వ‌స్తున్న తొలి చిత్రంగా రేపు (శుక్ర‌వారం) ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా పెద్ద హీరోలు మ‌హేశ్‌బాబు, నాగార్జున‌, వెంక‌టేశ్ చిత్రాల‌కు పోటీగా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే పెయిడ్ ప్రీమియ‌ర్లు, బెన్‌ఫిట్ షోల‌తో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్‌ను తెచ్చి పెట్టుకుంది. అయితే ఈ హ‌నుమాన్ సినిమా విడుద‌ల అవుతున్న రోజే మ‌రో హ‌నుమాన్ కూడా విడుద‌ల అవుతున్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు, కాకుంటే ఇది యానిమేష‌న్‌ సిరీస్. కాగా ఈ రెండు ఒకేరోజు ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం యాదృశ్చికంగా జ‌రుగుతోంది.

అయిన‌ప్ప‌టికీ ఈ సిరీస్‌కున్న క్రేజ్‌,రేంజ్ మ‌రో లెవ‌ల్‌లో ఉంటుందంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌లా ఇది జ‌నంలోకి చొచ్చుకుపోయింది. ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ (The Legend Of Hanuman) పేరిట వ‌స్తున్న ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే మొద‌టిభాగం 2021 జ‌న‌వ‌రి 29,రెండో భాగం జూలై 27న స్ట్రీమింగ్ అవ‌గా రెండు, మూడు నెల‌ల త‌ర్వాత అన్ని సౌత్ ఇండియ‌న్ లాంగ్వేజెస్‌ ఆడియోల్లోను తీసుకు వ‌చ్చారు. దీంతో ఈ సిరీస్‌కు దేశ వ్యాప్తంగా విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. మ‌ళ్లీ మూడేండ్ల త‌ర్వాత మూడ‌వ సీజ‌న్‌ రేప‌టి నుంచి (జనవరి 12) ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్ (Hotstar) లో స్ట్రీమింగ్‌కు కానుంది. పిల్లలు బాగా ఇష్ట‌ప‌డి చూసే ఈ సిరీస్‌లో మ‌నం ఒక్క పార్ట్‌ చూసినా సీజ‌న్‌లు మొత్తం పూర్తిగా చూసేలా చేయ‌డం దీనికున్న ప్ర‌త్యేక‌త‌. ఈ సిరీస్‌లో రామాయ‌ణంలో మ‌న‌కు తెలియ‌ని చాలా విష‌యాల‌ను, విశేషాల‌ను కండ్ల‌కు క‌ట్టినట్టుగా చూపించ‌డ‌మే కాక మ‌న‌ల్ని ఆ ప్ర‌పంచంలోకి తీసుకెళుతుంది.


అయితే రేప‌టి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ది లెజెండ్ ఆఫ్ హనుమాన్(The Legend Of Hanuman) సీజన్ 3 కోసం హనుమాన్ చాలీసా అన్ష్ వెర్షన్ కొరకు ప్రముఖ గాయకుడు, కీర‌వాణి కుమారుడు కాల భైరవ తన గాత్రాన్ని అందించడం విశేషం. హ‌నుమంతుడు లంక‌లో అడుగుపెట్టి రావ‌ణ సైన్యంతో పోరాడ‌డం, రావ‌ణుడి కొడుకుల‌ను మ‌ట్టి క‌రిపించ‌డం వ‌ర‌కు రెండో సీజన్‌లో చూయించ‌గా త‌ద‌నంత‌ర పోరాటాల‌ను, రామ రావ‌ణ యుద్ధాల‌ను తాజాగా వ‌స్తున్న‌ మూడ‌వ సీజ‌న్‌లో చూపించ‌నున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌ని వారు, చూసిన వారు ఇంటిల్లిపాది కుటుంబ స‌మేతంగా ఈ సంక్రాంతి సెల‌వుల్లో చూసి ఆస్వాదించండి. ఇదిలాఉండ‌గా ఈ సిరీస్ వ‌ల్ల ‘హను-మాన్’ సినిమాకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అని సినీ అభిమానులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Updated Date - Jan 11 , 2024 | 05:20 PM