Baak OTT Update: ఓటీటీలోకి.. అదిరిపోయే హ‌ర్ర‌ర్‌ థ్రిల్ల‌ర్‌! ఎప్ప‌టి నుంచంటే? త‌మిళ్‌లో వంద కోట్ల వ‌సూళ్లు

ABN , Publish Date - May 17 , 2024 | 10:13 AM

డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి అదిరిపోయే హ‌ర్ర‌ర్ చిత్రం ఆర‌ణ్మై 4 రెడీ అవుతోంది. సుంద‌ర్.సి మెయిన్ లీడ్‌గా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో త‌మ‌న్నా, రాశిఖ‌న్నా ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. మే 3న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

Baak OTT Update: ఓటీటీలోకి.. అదిరిపోయే హ‌ర్ర‌ర్‌ థ్రిల్ల‌ర్‌! ఎప్ప‌టి నుంచంటే? త‌మిళ్‌లో వంద కోట్ల వ‌సూళ్లు
baak

డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి అదిరిపోయే హ‌ర్ర‌ర్ చిత్రం ఆర‌ణ్మై 4 (Aranmanai 4) రెడీ అవుతోంది. సుంద‌ర్.సి మెయిన్ లీడ్‌గా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో అగ్ర క‌థానాయిక‌లు త‌మ‌న్నా (Tamannaah Bhatia), రాశిఖ‌న్నా (Raashii Khanna) ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా మే 3న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఏకంగా రూ. 90 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టడ‌మే కాక ఈ ఏడు త‌మిళ సినిమా హ‌య్యెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. తెలుగులో బాక్ (Baak) గా విడుద‌లైన ఈ మూవీ ఇక్క‌డా మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది.

baak.jpeg

గ‌తంలో వ‌చ్చిన మూడు భాగాలుగా వ‌చ్చిన అర‌ణ్మై( క‌ళావ‌తి, చంద్ర‌క‌ళ‌, అంత‌పురం) మూడు చిత్రాల‌కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. క‌థ‌ విష‌యానికి వ‌స్తే.. శివ‌శంక‌ర్ ,శివాని అన్నాచెల్లెల్లు. శివాని ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా త‌ను ప్రేమించిన ఓ వ్య‌క్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. అనుకోకుండా ప‌ది సంవ‌త్స‌రాల త‌ర్వాత చెత్తి శివాని అత్మ‌హ‌త్య చేసుకుంద‌ని, ఆమె భ‌ర్త అనుమానాస్ప‌దంగా చ‌నిపోయాడ‌ని శివ‌శంక‌ర్‌కు వార్త తెలుస్తుంది. దీంతో అక్క‌డ ఏం జ‌రిగిందో తెలుసుకోవ‌డానికి శివ‌శంక‌ర్ ఆ ఊరికి వెళ‌తాడు.

Baak.jpg


శివాని ఇంటికి వెళ్లిన శివ‌శంక‌ర్ అక్క‌డ శివాని కూతురు అప‌స్మార‌క స్థితితో ఉండ‌డంతో మాయ అనే డాక్ట‌ర్ సాయంతో అక్క‌డే ఉంటుంటాడు. ఈ క్ర‌మంలో అక్క‌డ వింత వింత ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. అతీంద్రీయ శ‌క్తులు అక్క‌డి వారిని భ‌య‌బ్రాంతుకు గురి చేస్లుంటాయి. ఆ త‌ర్వాత త‌న చెల్లి మ‌ర‌ణం గురించి ఎంక్వైరీ చేస్తున్న క్ర‌మంలో కొత్త విష‌యాలు బ‌య‌ట ప‌డ‌తాయి. బాక్ ఎవ‌రు, చెల్లి మ‌ర‌ణానికి దానికి సంబంధం, పిల్ల‌ల‌ను ర‌క్షించుకోవ‌డానికి శివాని ఒంట‌రిగా చేసిన పోరాటం ఎమోష‌న‌ల్‌గా సాగుతూ ఫ్యామిలీ ఆడియొన్స్‌ను కంట‌త‌డి పెట్టిస్తాయి. చివ‌ర‌కి బాక్‌ని ఎలా మ‌ట‌క్టుబెట్టార‌నే అస‌క్తిక‌ర‌మైరన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా ఇంట్రెస్టింగ్‌గా సాగుతూ చూసే ప్రేక్ష‌కుల‌కు మంచి థ్రిల్‌ను అందిస్తుంది.

tamannaahbaak.jpg

కామెడీ, హ‌ర్ర‌ర్ జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ సినిమా న‌వ్వులు పూయించ‌డంలో విఫ‌ల‌మ‌యినా భ‌య పెట్ట‌డంలో మాత్రం స‌క్సెస్ అయింది. విజువ‌ల్స్ కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా క్ష‌ణాల్లో ఆకారం మార్చుకునే ద‌య్యంగా బాక్ క‌ట్టి ప‌డేస్తుంది. ఇప్పుడీ సినిమా మే చివ‌రివారంలో 31 నుంచి జీ5 (ZEE5)ఓటీటీ వేదిక‌గా ప్రేక్ష‌కుల‌కు అంబాటులోకి రానుంది. సో ఎవ‌రైతే థియేట‌ర్ల‌లో మిస్స‌య్యారో ఓటీటీలో ఫ్యామిలీతో క‌లిసి ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్‌.

baak.jpg

Updated Date - May 17 , 2024 | 10:51 AM