Om Bheem Bush: నో.. లాజిక్‌.. ఓన్లీ ఫ‌న్‌! ఓటీటీలోకి ఓం భీం భుష్

ABN , Publish Date - Apr 08 , 2024 | 03:34 PM

శ్రీ విష్ణు, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ఓం భీం భుష్. ఎలాంటి లాజిక్కులు వెత‌క్కండి.. కామెడీని ఎంజాయ్ చేయండి అంటూ ప్రేక్ష‌కుల్లో మంచి అటెన్ష‌న్ తీసుకు వ‌చ్చింది.

Om Bheem Bush: నో.. లాజిక్‌.. ఓన్లీ ఫ‌న్‌! ఓటీటీలోకి ఓం భీం భుష్
OmBheemBush

సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ చిత్రం త‌ర్వాత యంగ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu), ప్రియ‌ద‌ర్శి (Priyadarshi Pulikonda), రాహుల్ రామ‌కృష్ణ‌ (Rahul Ramakrishna) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ఓం భీం భుష్ (Om Bheem Bush). ఔట్ అండ్ ఔట్ కామెడీ జాన‌ర‌లో వ‌చ్చిన ఈ సినిమాకు శ్రీహ‌ర్ష కొనుగంటి (Sree Harsha Konuganti) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా మార్చి 22న థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నెల రోజులు గ‌డ‌వ‌క ముందే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ద‌మైంది.

obbb.jpeg

ఏప్రిల్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (AmazonPrimeVideo)లో స్ట్రీమింగ్ కానున‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఎలాంటి లాజిక్కులు వెత‌క్కండి.. కామెడీని ఎంజాయ్ చేయండి అంటూ టీజ‌ర్ విడుద‌ల నాటి నుంచి చెబుతూ వ‌చ్చిన టీం ప్రేక్ష‌కుల్లో మంచి అటెన్ష‌న్ తీసుకువ‌చ్చింది. వారు చెప్పిన విధంగానే సినిమా సాగ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ సినిమాను ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా శ్రీ విష్ణు, రాహుల్ రామ‌కృష్ణ‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు, డైలాగ్స్ అంత‌కుమించి అనేలా వినోదాన్ని పండించాయి.


ఇక క‌థ విష‌యానికి వ‌స్తే.. క్యారెక్ట‌ర్ల పేర్ల నుంచి ప్ర‌తి స‌న్నివేశం వినూత్నంగా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. కృష్ణ‌కాంత్ (శ్రీ విష్ణు (Sree Vishnu), విన‌య్ గుమ్మ‌డి (ప్రియ‌ద‌ర్శి (Priyadarshi), మాధ‌వ్ రేలంగి (రాహుల్ రామ‌కృష్ణ ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఊర్లో వాళ్లు ఏ ప‌ని చేసినా క‌లిసే చేస్తారు. ఈక్ర‌మంలో బ్యాంగ్ బ్రోస్ అనే పేరుతో ఏ టూ జెడ్ స‌ర్వీస్ సెంట‌ర్‌ను ప్రారంభించి ఫ‌లానా ప‌నే చేస్తామ‌న‌కుండా త‌మ ద‌గ్గ‌రికి వ‌చ్చిన‌, త‌మ దృష్టికి వ‌చ్చిన ప్ర‌తి పనిని ఒప్పుకుంటారు.. చేస్తుంటారు.

OBB-T.jpg

ఈ నేప‌థ్యంలో.. భైర‌వ‌పురంలోని ఓ పాడుబ‌డ్డ కోట‌లో కోట్ల‌లో నిధులు ఉన్నాయ‌ని, దానికి కాప‌లాగా ఉన్న దెయ్యాన్ని త‌రిమేసి ఆ నిధిని తీసుకురావాల‌నే ప‌నిని ఈ హీరో గ్యాంగ్‌ ఒప్పుకుంటుంది. ఈ క్ర‌మంలో ఈ బ్యాంగ్ బ్రోస్ గ్యాంగ్ లోప‌లికి వెళ్లి అ ద‌య్యాని ఎలా ఎదుర్కొన్నారు, ఆ నిధిని సొంతం చేసుకో గ‌లిగారా అనే ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాల‌తో లాజిక్కులతో సంబంధం లేకుండా అద్యంతం వినోదాత్మ‌కంగా తెర‌కెక్కించారు. థియేట‌ర్ల‌లో ఈ సినిమాను మిస్స‌యిన వారు ఇప్పుడు ఎంచ‌క్కా ఇంట్లోనే ఇక హాయిగా చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Updated Date - Apr 08 , 2024 | 03:34 PM