Krishnamma Ott: 240కి పైగా దేశాల్లో.. స్ట్రీమింగ్ అవుతోన్న‌ స‌త్య‌దేవ్ ‘కృష్ణ‌మ్మ‌’

ABN , Publish Date - May 30 , 2024 | 09:15 AM

స‌త్య‌దేవ్ న‌టించిన‌ తాజా రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘కృష్ణ‌మ్మ‌’. థియేట‌ర్ల‌లో విడుద‌లైన వారం రోజుల‌కే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఆశ్చ‌ర్య ప‌రిచిన ఈ సినిమా ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్ లో 240కు పైగా దేశాల‌లో స్ట్రీమింగ్ అవుతూ ద‌మ్ము రేపుతోంది..

Krishnamma Ott: 240కి పైగా దేశాల్లో.. స్ట్రీమింగ్ అవుతోన్న‌ స‌త్య‌దేవ్ ‘కృష్ణ‌మ్మ‌’
Satyadev

వెర్స‌టైల్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ (Satyadev) న‌టించిన‌ తాజా రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘కృష్ణ‌మ్మ‌’ (Krishnamma). ప్రముఖ దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించగా.. వి.వి.గోపాలకృష్ణ తెరకెక్కించారు. కృష్ణ బూరుగుల‌, ల‌క్ష్మ‌ణ్ మీసాల‌, నంద గోపాల్‌, హ‌రిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. థియేట‌ర్ల‌లో విడుద‌లైన వారం రోజుల‌కే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఆశ్చ‌ర్య ప‌రిచిన ఈ సినిమా ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్ (Prime VideoIN) లో 240కు పైగా దేశాల‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.

కృష్ణా న‌ది ఒడ్డున విజ‌య‌వాడ ప‌ట్టణంలో ముగ్గురు అనాథ‌లు శివ(కృష్ణ‌), భ‌ద్ర (స‌త్య‌దేవ్‌), కోటి (ల‌క్ష్మ‌ణ్ మీసాల‌) పెరిగి పెద్ద‌వుతారు. వీరి మ‌ధ్య చ‌క్క‌టి అనుబంధం ఉంటుంది. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితాల్లో ఓ ఘ‌ట‌న కార‌ణంగా అనుకోని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. జీవితాలు ఎన్నో ఒడిదొడుకుల‌ను ఎదుర్కొంటాయి. చిన్న‌త‌నంలో జైలుకి వెళ్లిన శివ, అక్క‌డి నుంచి వ‌చ్చాక నిజాయ‌తీగా జీవితాన్ని వెల్ల‌దీయాల‌నుకుంటాడు.

krishnamma.jpg


ముగ్గురి స్నేహితుల్లో భ‌ద్ర‌, కోటిల‌కు డ‌బ్బులు అవ‌స‌రం అవుతాయి. దాంతో వాళ్లు గంజాయి స్మ‌గ్లింగ్ చేయాల‌నుకుని పోలీసుల‌కు చిక్కుతారు. అదే స‌మ‌యంలో ఓ ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌ని చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతారు. దీని కార‌ణంగా వాళ్ల జీవితాల్లో ఊహించ‌ని ఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయి. ఆ ప‌ర్యావ‌సానాల‌ను వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు.. చివ‌ర‌కు ఏమైంద‌నేదే కృష్ణ‌మ్మ సినిమా.

krishnammamoviestill.jpg

మే నెల‌లో థియేట‌ర్స్‌లో విడుద‌లైన ‘కృష్ణ‌మ్మ‌’ (Krishnamma) చిత్రానికి అభిమానుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌(Prime VideoIN) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియా స‌హా 240కి పైగా దేశాల్లో సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంది. ప్రేక్ష‌కులు ఈ ర‌స్టిక్ అండ్ రా యాక్ష‌న్ ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Updated Date - May 30 , 2024 | 09:24 AM